టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ పగ తీర్చుకుంటుందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలని బట్టి చూస్తే అవుననే అనుమానం కలుగుతుంది. అసెంబ్లీలో చంద్రబాబుని జగన్ తో సహ వైసీపీ ఎమ్మెల్యేలు ఓ రేంజ్ లో ఆట ఆడేసుకుంటున్నారని పూర్తిగా అర్ధమైపోతుంది. ఈ విషయం వైసీపీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విధంగా జరుగుతున్న ప్రజలు కూడా వైసీపీ రివెంజ్ ని అర్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబు పట్ల సానుభూతి చూపించడం లేదు. ఎప్పుడు చేసిన కర్మకు అప్పుడే ప్రతిఫలం తీసుకోవాల్సిందే అంటున్నారు.

 

ఎందుకంటే....2014 ముందు వరకు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చాలా తక్కువ ఉండేవి. అయితే 2014లో ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చేందో అప్పటి నుంచి పరిస్తితులు మారిపోయాయి. కేవలం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ గా చంద్రబాబు అండ్ బ్యాచ్ చాలా అవమానాలు చేసింది. జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఆయన్ని అడుగడుగునా అవమానించారు. అసెంబ్లీలో దారుణమైన విమర్శలు చేసేవారు. కనీసం మైక్ కూడా ఇవ్వకుండా దారుణంగా ప్రవర్తించారు.

 

ఇక రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి వారి పట్ల ఏ విధంగా నడుచుకున్నారో తెలిసిందే. అలాగే వైసీపీ నుంచే 23 మంది ఎమ్మెల్యేలని తీసుకునే వారి చేతనే....జగన్ ని నానా రకాలుగా తిట్టించారు. అయితే ఈ అవమానాలు కేవలం అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా చాలా చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం విశాఖకు వెళుతున్న జగన్ ని ఎయిర్ పోర్టులోనే నిర్బంధించి ఇబ్బందులు పెట్టారు. ఇక చెవిరెడ్డిని జైలులో పెట్టి ఏ విధంగా హింసించారో కూడా తెలిసిందే.

 

ఇన్ని రకాలుగా ఇబ్బందులు, అవమానాలు ఎదురు కావడంతోనే ఈరోజు చంద్రబాబు, టీడీపీ పరిస్తితి ఇలా అయిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.  అయితే చంద్రబాబు లాగా కాకుండా ఓ పాయింట్ వైజ్ జగన్ ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి అంశంలోనూ గత టీడీపీ ప్రభుత్వం చేసిన విధానాలని ఎండగడుతూ...బాబు బ్యాచ్ ని ఆడుకుంటున్నారు. మొత్తానికైతే బాబుపైన రివెంజ్ తీర్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: