తెలంగాణలో గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఎక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ పై కనీసం విమర్శలు కూడా చేసింది లేదు. ఒకవేళ విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీలోని ఎంపీ రేవంత్ రెడ్డి తప్ప మిగతా వారందరూ సైలెంట్ గానే ఉంటున్నారు. కాగా తాజాగా తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదంతా తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు తోనే గడిచిపోయింది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా... ప్రజలకు జరిగిన ప్రయోజనం మాత్రం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. 

 

 

 తెలంగాణ ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి సాధించింది అంటే అది కేవలం మద్యం ఆదాయం రెట్టింపు చేసుకోవడంలో మాత్రమే అభివృద్ధి సాధించింది  అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైద్యురాలు దిశ అత్యాచార ఘటన వంటి దారుణాలు తెలంగాణలో జరగడం సహా... తెలంగాణ ప్రభుత్వ అసమర్థత తో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలతో తెలంగాణ పరువు పోయింది అంటూ విమర్శలు గుప్పించారు ఉత్తమ్ . టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా దారుణంగా దిగజారిపోయింది అంటూ ఆరోపించారు ఆయన. 

 

 

 ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లే ఇదంతా జరిగిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు.. మిషన్ కాకతీయ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కేవలం కమీషన్ల కోసమేనని  ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్థిక స్థితి బాగోలేదు ఆర్థిక క్రమశిక్షణ అవసరం అంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు... గతంలో కొత్త అసెంబ్లీ కడతాను... కొత్త సచివాలయం కడతాను అంటూ ప్రగల్బాలు పలికినప్పుడు ఈ బుద్ధి ఏమైంది అంటూ ప్రశ్నించారు. అప్పుడెందుకు ఆర్థిక క్రమశిక్షణ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడలేదు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: