హైదరాబాద్ షాద్నగర్ లో జరిగిన దిశా  అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశా ఘటన లోని  క్రూర మృగాలను కఠినంగా శిక్షించాలి అంటూ దేశం మొత్తం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు అమాయకురాలైన వైద్యురాలిపై అత్యాచారం చేసి చంపిన ఆ రాక్షసులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దిశ కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్పై దేశం మొత్తం హర్షధ్వానాలు వ్యక్తం చేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను ఇలాంటి శిక్షలు సరైనది అంటూ తెలంగాణ పోలీసుల పై ప్రశంసలు కురిపించింది దేశ ప్రజానీకం. 

 

 

 

 అటు కేసీఆర్ పై కూడా ప్రశంసలు కురిపించారు. కాగా  దిశ పై అత్యాచార ఘటన జరగడానికి మద్యం ఒక కారణం అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పరిపూర్ణానందస్వామి ఓ  సూచన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విడతలవారీగా మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని... ఒకవేళ ఇలా చేస్తే దిశ ఆశీస్సులు సీఎం కేసీఆర్ కు  తప్పకుండా ఉంటాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద బీజేపీ నేత డీకే అరుణ చేపట్టిన రెండు రోజుల మహిళా సంకల్ప దీక్ష నేటితో ముగిసింది. డీకే అరుణకు కొబ్బరినీళ్లు ఇచ్చి దీక్షను విరమింప చేశారు పరిపూర్ణానంద స్వామి. 

 

 

 

 తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు పరిపూర్ణానంద స్వామి. ఈ సందర్భంగా దీక్షా అత్యాచార ఘటన విషయంలో హోంమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలను పరిపూర్ణానందస్వామి తప్పుబట్టారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ లో సంచలనం సృష్టించిన డ్రగ్ కేసు  గురించి పరిపూర్ణానంద స్వామి ప్రస్తావిస్తూ... ఈ కేసు విషయం ఏమైందో ప్రజలకు తెలపాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా తాజాగా పార్లమెంటులో పౌరసత్వ బిల్లు గురించి కూడా ఆయన మాట్లాడారు. పౌరసత్వ బిల్లుకు  టిడిపి శివసేన పార్టీ ల మద్దతు ఇవ్వక పోవడం అవకాశవాదం అంటూ ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: