ఏడేళ్లు నిరీక్షించాం.. మరో వారం ఆగటానికి సమస్య లేదన్నారు నిర్భయ తల్లిదండ్రులు. నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ పటియాలా హౌస్ లో నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల 18కి వాయిదా పడింది. నిందితుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్ ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో దీనిపై విచారణను 18కి వాయిదా వేసింది.

 

నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలన్న పిటిషన్‌పై విచారణను ఈ నెల18కి దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో దోషిగా ఉన్న అక్షయ్‌ రివ్యూ పిటిషన్‌ ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది. మరోవైపు నిర్భయ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్షయ్ రివ్యూ పిటిషన్లో ప్రతివాదిగా చేర్చాలని అనుమతి కోరారు. దీనిపై పిటిషన్ వేసేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే అనుమతించారు. అయితే ఏడేళ్ల నుంచి నిరీక్షిస్తూనే ఉన్నాం. మరో వారం వేచిచూడగలమన్నారు నిర్భయ తల్లి. డిసెంబర్ 18న వారిపై డెత్ వారెంట్ విడుదలవుతుందని ఆమె అన్నారు. ఈ నెల 17న ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది.

 

అక్షయ్ సింగ్ పిటిషన్‌ పై ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. తనకు వేసిన మరణశిక్ష తీర్పును పున:సమీక్షించాలని అక్షయ్ తన పిటిషన్ లో కోరాడు. ఈ సందర్భంగా అతగాడో వింత వాదన చేశాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల ఎలాగూ తన ఆయుష్షు తగ్గిపోతుందని అలాంటప్పుడు ఇంక మరణశిక్ష ఎందుకని ఆయన ప్రశ్నించాడు. 2012 డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి ఆమె మృతికి ఆరుగురు కారణమయ్యారు. ఈ నేరానికి పాల్పడ్డ వారిలో ఒకరు చనిపోగా.. మరొకరు జువైనల్. దీంతో మిగిలిన నలుగురికి ఉరిశిక్ష అమలు కానుంది.

 

అక్షయ్ సింగ్ పిటిషన్ పై సుప్రీం రివ్యూ చేసేది లేదనీ, గత తీర్పే ఫైనల్ అని చెబితే మరణ శిక్షకు రూట్ క్లియర్ అవుతుంది. నిర్భయ దోషులకు అన్ని ఆప్షన్లు పూర్తవుతాయి. మరోపక్క తీహార్ జైల్లోనే దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బక్సర్ జైలు నుంచి ఉరి తాళ్లు కూడా ఆర్డర్ చేశారు. ఈ తాళ్లతో ఇప్పటి వరకు కోల్ కతా అలీపూర్ జైల్లో రేపిస్టు ధనుంజయ్ ఛటర్జీని ఉరి తీశారు. అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్ను కూడా ఈ తాళ్లతోనే ఉరి తీశారు. అయితే తీహార్ జైలులో ఒకే సమయంలో ఇద్దరికి మాత్రమే ఉరి వేసేలా చాంబర్ ఉంది. దీన్ని 1950లో నిర్మించారు. దీంతో నలుగురిని ఒకేసారి ఉరి తీసేలా ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: