దిశ అత్యాచారం హత్య తర్వాత మహిళల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఒంటరి గా మహిళలు రోడ్డు మీదకు వెళ్ళాలి అంటేనే భయపడే పరిస్థితి దేశంలో ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇన్నాళ్ళు మహిళలకు రక్షణ ఉందని భావించిన వాళ్ళు కూడా ఈ పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఆ ఘటన తర్వాత కూడా అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

 

ఈ నేపధ్యంలో మహిళల భద్రతే ప్రధాన ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపి దిశ అనే చట్టానికి రూపకల్పన చేసింది. ఈ చట్టం రాష్ట్ర శాసన సభలో ఆమోదం కూడా పొందింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు జగన్ పై మహిళలు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన అక్క చెల్లెమ్మల కోసం తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని, ఎవడైనా సరే నేరం చెయ్యాలి అంటే రాష్ట్రంలో భయపడే పరిస్థితి జగన్ కల్పించారు అంటూ వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

ఇక జగన్ కు మహిళలు పాలాభిషేకం కూడా చేశారు. ఒక్క ఏపీలోనే కాదు... రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో మ‌హిళ‌లు, విద్యావంతులైన మ‌హిళ‌లు కూడా జ‌గ‌న్ డెసిష‌న్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తమ మీద జగన్ పై ఉన్న ప్రేమకు మహిళలు ఫిదా అయిపోయారు. దేశం మొత్తం జగన్ వైపు చూస్తుందని, దేశ చరిత్రలోనే ఈ చట్టం చిరస్థాయిగా నిలిచిపోతుంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 

రాజకీయంగా జగన్ ఎలా వెళ్ళినా సరే... నమ్మిన వారి విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదని, ఈ చట్టం ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఇన్నాళ్ళు జగన్ ని విమర్శించిన వాళ్ళు కూడా కొనియాడుతున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్ పై ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: