‘ఏం పర్వాలేదు తమ్ముళ్ళు...నాయకులు పోయినా...మనకు కేడర్ బలంగా ఉంది’ ఈ డైలాగ్ టీడీపీ నుంచి ఏ నాయకుడు వీడి వెళ్ళిన అధినేత చంద్రబాబు చెబుతుంటారు. అయితే ఈ డైలాగులు ఒకప్పుడు వర్కౌట్ అయ్యేవి కానీ...ఇప్పుడు చాలా కష్టం. చంద్రబాబు సత్తా అయిపోవడం, టీడీపీని భవిష్యత్తులో నడిపించే సరైన నాయకుడే కనపడకపోవడంతో నేతలతో పాటు..కేడర్ కూడా జంప్ అయిపోతుంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది నేతలు టీడీపీని వీడిన విషయం తెలిసిందే.

 

ఇక ఇందులో కొందరిని పక్కనబెడితే...కొందరు బలమైన నాయకులు పార్టీని వీడారు. వీరే వెనుకే టీడీపీ కేడర్ కూడా వీడింది. అయితే కొన్ని చోట్ల నేతలు వెళ్ళిన...కేడర్ మాత్రం అలాగే పార్టీని అంటిపెట్టుకుని ఉంది. కానీ నేతలు వెళ్ళి నెలలు గడుస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకుడే లేకపోవడంతో ఆ కేడర్ కూడా దుకాణం సర్దేస్తుంది. ఉదాహరణకు ఎన్నికల తర్వాత రామచంద్రాపురం నేత తోట త్రిమూర్తులు, బాపట్ల నేత అన్నం సతీశ్, ధర్మవరం వరదాపురం సూరిలు టీడీపీని వీడారు. వీళ్ళు పార్టీని వీడి చాలరోజులు అయింది. అయినా కానీ బాబు ఇంకా వేరే నాయకుడుని పెట్టలేదు. దీంతో కేడర్ కూడా వేరే ఆప్షన్ చూసుకుంటుంది.

 

అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయిన వాళ్ళు యాక్టివ్ గా ఉండటం లేదు. అలాంటి చోట్ల కూడా కేడర్ తమ దారి తాము చూసుకుంటున్నారు. ఉదాహరణకు భీమిలిలో సబ్బం హరి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఓడిన దగ్గర నుంచి అందుబాటులో లేరు. దీంతో అక్కడే గెలిచే,...ప్రస్తుతం మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్..బలమైన టీడీపీ కేడర్ ని తమ పార్టీలో చేర్చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వారికి ఏదొకటి చెప్పి, పదవులు ఇస్తామని మాట్లాడి ఒప్పిస్తున్నారు.

 

ఇక ఇటు ఇటీవల కృష్ణాలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,  గుడివాడ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ లు జంప్ అయిపోయారు. ఆ రెండు చోట్ల టీడీపీని నడిపించే నాయకుడు లేడు. దీంతో అక్కడ కేడర్ వైసీపీలోకి వచ్చేసింది. మొత్తానికి ఇలా తెలుగు తమ్ముళ్ళు వైసీపీ గూటికి వెళ్లిపోతున్నారు.  


 

మరింత సమాచారం తెలుసుకోండి: