ఎన్నికల్లో మహిళలే ముఖ్య పాత్ర పోషిస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా ప్రభుత్వం కూలిపోవాలన్న, ఏదైనా కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న వారే డిసైడ్ చేస్తారు. మొన్న ఏపీ ఎన్నికలో కూడా ఇదే జరిగింది. గత టీడీపీ ప్రభుత్వం చేసిన మోసానికి మహిళలు పెద్ద ఎత్తున వైసీపీ వైపు వెళ్ళి జగన్ ని సీఎం చేశారు. ఇక జగన్ అధికారంలోకి రావడమే తనని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన అక్కా చెల్లెళ్లకు సాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లోనే మహిళకు సంబంధించి అనేక మంచి పథకాలు అమలు చేశారు.

 

సమాజంలో సగ భాగం ఉన్న మహిళలకు సమ ప్రాధాన్యత ఇచ్చారు. పింఛన్లు, మద్యపాన నిషేధం, పదవులు, ఉద్యోగాల్లో అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఇక త్వరలోనే ప్రతి తల్లికి ఉపయోగపడేలా అమ్మఒడి పథకం అమలు చేయనున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఏపీలో ఎక్కువ మహిళల మద్ధతు జగన్ సంపాదించుకున్నారు. అయితే తాజాగా తీసుకున్న రెండు నిర్ణయాలతో వారి మద్ధతు మరింత ఎక్కువ దక్కేలా చేసుకున్నారు.

 

ప్రతి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే ఉద్దేశంతో...వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం తీసుకు రానున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో తమ పిల్లలని చదివించలేని తల్లుల బాధ చూసి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలో ప్రతి మహిళా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇటీవల తెలంగాణలో జరిగిన దిశ ఘటనని దృష్టిలో పెట్టుకుని, అక్కడే ప్రభుత్వం కంటే ముందే మహిళలపై చేయి వేస్తే....ఆ మరుక్షణమే ఆ మృగాడి మరణశాసనం కావాలని కొత్త చట్టం తీసుకొచ్చారు.

 

ఆడపిల్లలపై రేప్ చేస్తే.... వాడిని 21 రోజుల్లోనే ఉరి తీయాలని చట్టం రూపొందించారు. ఇక ఈ చట్టం తీసుకురావడంతో ప్రతి ఒక్క మహిళా జగన్ కు కృతజ్ఞత తెలుపుకుంటున్నారు. ముఖ్యంగా యువ మహిళలు జగన్ కు పెద్ద ఎత్తున మద్ధతు తెలుపుతున్నారు. ఏదేమైనా 7నెలల్లోనే జగన్ మహిళల కోసం అద్భుతమైన పథకాలు, నిర్ణయాలు తీసుకొచ్చి వారి పూర్తి మద్ధతు దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: