ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన ఆ పార్టీకి కొత్త కస్టాలు వచ్చాయి... ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.. రాజకీయంగా ఆ పార్టీకి నిలబడే అవకాశం లేదనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. క్రమంగా క్యాడర్ లో కూడా నమ్మకం సన్నగిల్లుతుంది అనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లోనే ఎక్కువగా వినపడే పరిస్థితి ఉంది. 

 

దీంతో చాలా మంది నేతలు రాజకీయంగా పక్క చూపులు చూస్తున్నారని, భవిష్యత్తు మొత్తం వైసీపీది అంటూ వాళ్ళు భావిస్తున్నట్టు ఇప్పుడు అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆ పార్టీని ఇన్నాళ్ళు మోసిన వాళ్ళే ఇప్పుడు దాదాపుగా తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో... ఇప్పుడు ఎమ్మెల్యేలు కొందరు చంద్రబాబుకి స్పష్టంగా చెప్పారని సమాచారం. 

 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు సమావేశామై తాము ఉండలేమని పార్టీకి భవిష్యత్తు ఎక్కడా కనపడటం లేదని, జగన్ నిర్ణయాల పట్ల రాష్ట్రంలో మంచి అభిప్రాయం ఉందని, తమ నియోజకవర్గంలో కూడా జగన్... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పొగుడుతున్నారని వ్యాఖ్యానించారట. ఈ విష‌యం బాబుకు చెప్ప‌డంతో బాబు వాళ్ల‌కు ఎలా స‌ర్ది చెప్పాలో ?  తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ఈ మ్యాట‌ర్ ఇప్పుడు టీడీపీలోనే హైలెట్ అవుతోంది.

 

6 మంది ఎమ్మెల్యేలు ఇదే విధంగా చంద్రబాబుకి చెప్పగా... ఆయన ఏం కాదు మూడేళ్ళలో ఎన్నికలు వస్తాయి మనం తప్పకుండ విజయం సాధిస్తాం... ప్రభుత్వానికి భవిష్యత్తు లేదని ఎప్పుడు చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు అయితే తమకు అసెంబ్లీ కి రావడం కూడా ఇష్టం లేదని చెప్పగా... అందరం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని, కాబట్టి రావాల్సిందే అని వారికి సూచించారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: