తెలుగుదేశం పార్టీలో తనకు అన్యాయం జరిగిందని భావిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ లోకి వెళ్ళిన యువనేత దేవినేని అవినాష్ ఇప్పుడు దుమ్ము రేపుతున్నారు. తూర్పు నియోజకవర్గంలలో ఆయన హవా క్రమంగా పెరుగుతుంది. పార్టీలోకి వచ్చిన వారం లోపే ఆయనకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న బొప్పన భావకుమార్ ని తప్పించి జగన్ అవినాష్ కి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇక అక్కడి నుంచి ఆయనతో వరుసగా అధికారులు, స్థానిక నేతలు సమావేశమవుతున్నారు.

 

నియోజకవర్గంలో జరిగే ప్రతీ అభివృద్ధి కార్యక్రమం, ప్రతీ సమాచారం అవినాష్ కి ఇస్తున్నారు. ఇక నియోజకవర్గంలో ఏవైనా సమస్యలు ఉన్నా సరే నియోజకవర్గ నేతలు ఎక్కువగా అవినాష్ నే కలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న స్థానిక నాయకత్వం కూడా ఇప్పుడు అవినాష్ మీద ఆధారపడుతున్నట్టు తెలుస్తుంది. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గా ఉన్నా సరే ఆయన వల్ల‌ ఇప్పుడు పనులు జరగవని... అవినాష్  అయితే దూకుడుగా వెళ్లి తమకు సహాయం చేస్తారని ధీమా వాళ్ల‌కు కూడా వ‌చ్చేసింది. పాత ప‌రిచ‌యాలు ఎలాగూ వాళ్ల‌కు క‌లిసి వ‌స్తున్నాయి.

 

అవినాష్‌కు జగన్ వద్ద కూడా సానుకూల అభిప్రాయం ఉందని కాబట్టి, అవినాష్ ని కలిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారట నియోజకవర్గ నేతలు. ఇప్పుడు ఇదే గద్దె రామ్మోహన్ కి చుక్కలు చూపిస్తుందని అంటున్నారు. తన వర్గం కూడా అవినాష్ వద్దకు వెళ్ళడంతో గద్దె వారిని కాపాడుకోలేక జాగ్రత్తలు పడుతున్నారు.

 

అవినాష్ ఏ విధంగా ముందుకి వెళ్తున్నారు అనేది ఆయనకు అంతుబట్టడం లేదు. నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ వార్డులు అవినాష్ ఈ క్రేజ్ తో గెలిచే అవకాశం ఉందని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఖాళీ గా ఉన్న అవినాష్ నివాసం ఇప్పుడు జనం తో నిండిపోతుంది. ఏది ఎలా ఉన్నా తన అనుభవం వయసున్న అవినాష్ చేతిలో గద్దె ఇప్పుడు ఇబ్బంది ప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: