కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో ఎప్పటికప్పుడు కుంభకోణాలు, మోసాలు బయటపడతూనే ఉన్నాయి. పారదర్శకత కోసం టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు ఎక్కడో ఒకచోట బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. కొందరు భక్తులు సైతం శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆత్రుతలో  సులువుగా మోసపోతున్నారు.

 

 

మరికొందరు తాము వీఐపీలమని చెప్పుకుని నకీలీ పత్రాలు సృష్టంచుకుని రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇలాంటి ఒక నకిలీ అధికారిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. నకిలీ ఐ.ఆర్.ఎస్ అధికారి పేరిట శ్రీవారి వీఐపి బ్రేక్ దర్శన టికెట్లు పొందిన వ్యక్తిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

 

 

గుంటూరుకు చెందిన చీరల డిజైనింగ్ వ్యాపారి కె.వి. రత్నారెడ్డి డైరెక్టర్ జనరల్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మహారాష్ట్ర పేరుతో డూప్లికేట్ ఐడీ కార్డును సృష్టించుకుని గురువారం విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల కోసం టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో లేఖ సమర్పించారు. సిబ్బంది వెంటనే టికెట్లు మంజూరు చేశారు. రత్నారెడ్డి ఐడెంటీటీ పై అనుమానం కలగడంతో మహారాష్ట్ర అధికారులతో క్రాస్ చేశారు.

 

 

ఆ పేరుతో ఎవరూ లేరని తెలిసింది. దీంతో విజిలెన్స్ వారిని అప్రమత్తం చేశారు. ఉదయం దర్శనానికి వెళుతున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసు లకు అప్పగించారు. ఇకపోతే గతంలోనూ ఇదే తరహాలో రత్నారెడ్డి. శ్రీవారిని దర్శించుకున్నాడు. నఖిలీ అధికారి బాగోతం బయటపడడంతో ఉన్నతాధికారులు సిఫార్సు లేఖలు కూడా క్షుణ్ణంగా పరిశిలిస్తున్నారు.

 

 

ఇకపోతే రత్నారెడ్డి మీద ఇదివరకే ఏపీ, తెలంగాణాలో కలిపి మొత్తం 8 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే కాకుండా బంజార హిల్స్ లో వూభిచార గృహం కూడా నిర్వహించినట్లుగా కనుగొన్నారు. నిందితుడిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: