పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ర్టాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ర్టాల్లో నిర‌ర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు.. ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీనిపై ఆమోద ముద్ర వేశారు. కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ రాజపత్రం(గెజిట్) విడుదల చేసింది. అయితే, మ‌రోవైపు ప్ర‌ముఖుల ప‌ర్య‌ట‌న‌ల రద్దు ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌ హోంమంత్రి అసద్ జ్జమన్ ఖాన్, విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మూమెన్ తమ భారత పర్యటనలను రద్దు చేసుకున్నారు.అదే జాబితాలో జపాన్‌ ప్రధాని షింజో అబే కూడా చేరారు. షింజో త‌న టూర్‌ రద్దు చేసుకున్నట్లే...కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా షిల్లాంగ్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. 

కేసీఆర్ ఏడాది స‌ర్కారు...విజ‌య‌శాంతి అదిరిపోయే రివ్యూ

 

ప్ర‌స్తుతం మేఘాలయలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రాబోయే 48 గంటల పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మ‌రోవైపు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో నార్త్‌ ఈస్ట్‌ పోలీసు అకాడమీలో ఈ నెల 15న పోలిస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కార్యక్రమం ఉంది. ఈ పరేడ్‌ కార్యక్రమానికి అమిత్‌ షా హాజరు కావాల్సి ఉంది. కానీ షిల్లాంగ్‌లో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోంశాఖ వర్గాలు అమిత్‌ షా పర్యనను రద్దు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 16న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఓ ఫెస్టివల్‌కు కూడా అమిత్‌ షా హాజరు కావాలి. ఆ పర్యటన కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. 

 

రాజ‌ధానిగా అమ‌రావ‌తి....జ‌గ‌న్ స‌ర్కారు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

కాగా, సోంలో అయితే ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో జపాన్‌ ప్రధాని షింజో అబే తన భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. జపాన్‌ ప్రధాని షింజో అబే.. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 15(ఆదివారం) నుంచి 17వ తేదీ వరకు భారత్‌లో పర్యటించాలి. పర్యటనలో భాగంగా అసోం రాజధాని గువాహటిలో 15వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే సమావేశం కావాల్సి ఉంది. అయితే గువాహటిలో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో షింజో అబే తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: