ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం చేసినా చిన్నారులపై  అత్యాచార ఘటనలు మాత్రం ఆగడం లేదు . హైదరాబాద్ శివార్లలో చోటు చేసుకున్న  దిశ ఘటన మర్చిపోకముందే   , గుంటూరు లో  ఐదేళ్ల బాలికపై ఇంటర్ చదువుతోన్న యువకుడు అత్యాచారం చేశాడు . గుంటూరు పట్టణం లోని రామిరెడ్డి నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది .  చిన్నారి కడుపు నొప్పి ఉందని చెప్పడం తో తల్లితండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా , పరీక్షించిన వైద్యులు చిన్నారి అత్యాచారానికి గురైనట్లు తేల్చారు . తమ ఇంటి కింద ఉంటున్న యువకుడే ఈ దుశ్చర్య కు పాల్పడినట్లు తెలిసి చిన్నారి   కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు . 

 

ఏపీ అసెంబ్లీ లో దిశ చట్టం ఆమోదం పొందిన తరువాత వెలుగు చూసిన ఈ ఘటన లో  నిందితుడికి జీవిత ఖైదు పడుతుందా ? లేకపోతే  మరణశిక్ష విధించే అవకాశాలున్నాయా ? అన్నది హాట్ టాఫిక్ గా మారింది . కేంద్రం చేసిన నిర్భయ చట్టానికి పలు సవరణలు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ దిశ చట్టాన్ని ఆమోదించింది . ఈ చట్టం ఆమోదం పొందితే అత్యాచార ఘటనలు అవకాశం ఉండదని అందరు భావించారు .

 

 దిశ చట్టం ప్రకారం అత్యాచార ఘటన లో నిందితుడి  విచారణ తంతును నాలుగు నెలల నుంచి 21 రోజులకు కుదించారు . విచారణ లో తిరుగులేని ఆధారాలుంటే 14 రోజుల్లోనే న్యాయ ప్రక్రియ పూర్తి చేసి 21  రోజుల్లోనే నిందితునికి శిక్ష పడేలా చట్టం రూపొందించారు . చిన్నారులపై లైంగిక దాడి జరిగితే పోక్సో చట్టం ప్రకారం ఇప్పటి వరకు మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేవారు కానీ దిశ చట్టం ప్రకారం జీవితఖైదు లేదంటే మరణశిక్ష విధించే అవకాశాలున్నాయి .   

మరింత సమాచారం తెలుసుకోండి: