కొద్దిరోజుల క్రితం ఎంతో సంచలనం రేపిన లేడీ వెటర్నరీ డాక్టర్ అయిన ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి హత్యోదంతం పై మన దేశవ్యాప్తంగా ఎంతో కలకలం రేగింది. ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ అనే నలుగురు నీచులు ఆమెను మాయమాటలతో మోసం చేసి, ఆపై ఆమెపై బలాత్కారం చేసి, హత్య చేసిన ఘటనపై ప్రముఖులు సైతం ఆవేదన వ్యక్తం చేసారు. ఇక ఈ దారుణంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటటంతో పాటు, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలందరూ కోరడం జరిగింది. 

 

అయితే ఆ దారుణం జరిగిన కొద్దిరోజుల తరువాత నిందితులను విచారణ సందర్భంగా ఒక చోటికి తీసుకెళ్లగా, ఆ సమయంలో పోలీసులపై వారు దాడి చేసి తప్పించుకోబోగా వారిని పోలీసులు అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసారు. ఇక ఆ ఘటనతో ప్రజలందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. ఇక ప్రజా మరియు మహిళా సంఘాల వారు అయితే, అటువంటి నీచులని వదిలి పెట్టకూడదని, మద్యం మత్తులో అమాయకురాలైన ఒక అమ్మాయిని కిరాతకంగా హింసించి అత్యాచారం చేసి చంపిన వారికి ఎన్కౌంటర్ కూడా చిన్న శిక్షే అని, 

 

అటువంటి వారిని పైన నరకంలో కూడా ఆ దేవుడు మరొక్కసారి మరింత కఠినంగా శిక్షించి తీరుతాడని, ఆ విధంగా వారికి రెండు సార్లు శిక్ష పడటమే సమంజసం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నేటి యువత మద్యం మత్తులో పడి తన, పర అనే బేధాలు మరిచి ప్రవర్తిస్తున్నారని, అలానే సెల్ ఫోన్ వంటి డిజిటల్ మాద్యమాలను తప్పుగా వినియోగిస్తూ చెడిపోతున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా ఈ విషయమై పిల్లల తల్లి తండ్రులు చిన్నతనం నుండే వారికి ఆడవాళ్ళ పట్ల మర్యాద, గౌరవం నేర్పడం అలవాటు చేయాలని, దానితో పాటు ప్రభుత్వాలు కూడా ఇటువంటి దారుణాలు చేసేవారి పై మరింత కఠినంగా శిక్షలు అమలు చేస్తే రాబోయే రోజుల్లో ఇవి తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: