ఓవైపు సంక్షేమ పథకాలు..మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు.. ఈ రెండింటినీ బ్యాలన్స్ చేయాల్సిన పరిస్థితి ఏపీ సీఎం వైఎస్ జగన్ ది.. అందులోనూ లోటు బడ్జెట్ వెక్కిరిస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఆర్థికంగా పొదుపు పాటింటి అవసరమైన చోట ఖర్చు చేసేందుకు ఆయన వ్యూహం రచిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు దిద్దుతూ.. ముందుకెళ్తున్నారు.

 

రాయలసీమకు జలాల తరలింపు కూడా జగన్ ప్రాధామ్యాల్లో ఒకటి. అందుకే దీని కోసం ప్లాన్ చేస్తున్నారు. హంద్రీనీవా సృజల స్రవంతి ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు తీసుకురావాలి. పేరూరు డ్యామ్‌కు ఒక టీఎంసీ ఇవ్వడానికి, ఏ ప్రాజెక్టు కూడా ఇంత వరకు చేపట్టకుండానే ఉన్న ప్రాజెక్టుల ద్వారా మడకశిర బ్రాంచ్‌ కాల్వ ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉంది. బీటీపీకి సంబంధించి లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ నుంచి పేరూరుకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆ ప్రాంత శాసనసభ్యుల కోరిక మేరకు రూ.13 వందల కోట్లతో అంచనాలు రూపొందించారు.

 

వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 75 ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ముందుకు తీసుకువచ్చి ఈపీసీ విధానంలో 60 నుంచి 70 శాతం పూర్తిచేయగలిగారు. ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్‌లకు ఒక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా అదే ఫాలో అవుతున్నారు. అవినీతి జరగకుండా రివర్స్‌టెండరింగ్‌ తీసుకువచ్చారు. నిధులు ఆదా చేస్తున్నారు.

 

 

2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే జీవో 22 విడుదల చేశారు. కాంట్రాక్టర్‌లకు నష్టం కలగకుండా లిబరైజేషన్‌ ఇచ్చే కార్యక్రమం చేశారు. అయితే అది అమలు చేయకుండా 60సీ అనే నిబంధన తీసుకువచ్చి కాంట్రాక్టులు రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో టెండర్లు జరిగిన రూ.2.30 లక్షల కోట్ల పనుల్లో దాదాపు 20 శాతం తేడా అంటే రూ.46 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందంటున్నారు వైసీపీ నేతలు. ఇలాంటి దోపిడీ అరికడితే రాయలసీమకు జలకళ తీసుకురావడం అసాధ్యం కాదన్నది జగన్ ఆలోచనగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: