ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మహిళలకు పెద్దపీట వేశారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించారు. దళిత వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు. నన్నయ్య యూనివర్సిటీలో ఒక అమ్మాయి సీఎంకు లెటర్‌ రాస్తే వెంటనే స్పందించి ఆ అమ్మాయికి సత్వర న్యాయం చేశారు. మహిళల రక్షణ కోసం దిశ యాక్టు తీసుకువచ్చారు. ఆడపిల్లలను మొదట తండ్రి చూసుకుంటే తరువాత అన్న చూసుకుంటాడు.

 

దిశ యాక్ట్ ప్రకారం..అత్యాచారం వంటి నేరాల్లో తగిన సాక్ష్యాధారుల ఉంటే వెంటనే శిక్షలు

అమలు చేస్తారు. విచారణ అంతా ముగించి కేసు నమోదు అయిన 21 రోజుల్లో దోషులను ఉరి తీస్తారు. మహిళల భద్రత కోసం ఏపీలో జీరో ఎఫ్‌ఐఆర్‌ ను జగన్ తీసుకువచ్చారు. దీనిప్రకారం.. స్టేషన్‌ పరిధిలో నేరం జరగకపోయినా 166ఏ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. నేరం తీవ్రత కఠినంగా ఉంటే ఎఫ్‌ఐఆర్‌ చేయాలి. ఇక దిశ యాక్ట్ ప్రకారం.. మహిళలపై సోషల్‌ మీడియాలో అగౌరపరిచేలా పోస్టింగులు పడితే 354ఈ ప్రకారం ఒకసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 ఎఫ్‌ కింద 5 నుంచి 7 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.

 

మహిళా మిత్ర, సైబర్‌ మిత్ర ద్వారా ఎవరైనా స్టేషన్‌కు రాలేకపోతే 9121211100 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే వారు ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేస్తారు. జీరో ఎఫ్‌ఐఆర్, స్పెషల్‌ ఫాస్టుర్యాక్‌ కోర్టులు, మహిళా హెల్ప్‌ లైన్‌ 100, 112, 181, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ 1098, అభయ్‌ పైలెట్‌ ప్రోగ్రాం అందిస్తున్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నేరాలు ఎక్కవగా జరుగుతున్నాయి. వీటి నివారణ కోసం 8 ఫోర్‌ విల్లర్స్, 70 టూవీలర్స్ తో మహిళా అధికారులను నియమించి అమ్మాయిలు ఎవరైనా ప్రమాదంలో ఉంటే రక్షిస్తున్నారు.

 

ఏపీ రూపొందించిన దిశ బిల్లు ఇంత పకడ్బందీగా ఉంది. అయితే ఈ చట్టం అమలుపై సందేహాలు వస్తున్నాయి. దీనిపై కోర్టుకు వెళ్తే.. అక్కడ ఈ శిక్షలు నిలుస్తాయా.. న్యాయస్థానాలు ఈ చట్టానికి ఎంత వరకూ అండగా నిలుస్తాయి అన్నది చూడాలి. ఓ మంచి ప్రయత్నమైతే జరిగిందేనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: