చంద్రబాబు ఇంగ్లీష్ పై ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు ఇంగ్లీష్ పై ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు. పొగుడుతూనే ఎద్దేవా చేశారు. ఇంతకీ అంబటి రాంబాబు ఏమన్నారంటే.. చంద్రబాబుకు ఇంగ్లీష్‌ రాదు అన్నడం సమంజసం కాదు. బిల్‌క్లింటన్‌, బిల్‌గ్రేట్స్‌, టోనిబ్లేయర్‌ లాంటి పెద్దలు ఇక్కడికి వచ్చి ఆయన ఇంగ్లీష్‌ విని పుంకాలు పుంకాలుగా పుస్తకాలు రాశారు. ఆ కథలన్ని పేపర్లో పడ్డాయి అన్నారు అంబటి రాంబాబు.

 

" వాస్తవానికి చంద్రబాబు అసలు ఇంగ్లీష్‌ రాదు. ఆయనకు బట్టర్‌ ఇంగ్లీష్‌ మాత్రమేవచ్చు. ఈ భాషలోనే ఆయన కాలం వెల్లదీస్తున్నారు. ఇంగ్లీష్‌, తెలుగు సమానమని భావించే వ్యక్తి చంద్రబాబు. ఇంగ్లీష్‌ను, తెలుగును కలిసి హైదరాబాద్‌లో చంద్రబాబు అందమైన ఒక వాక్యం కనిపెట్టారు. ఎవరిథింగ్‌ మనవాళ్లు బ్రిఫ్డ్‌మీ..టింగ్లీ భాషను కనిపెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబే అంటూ ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.

 

ఈ పండితుడిని చూసి తెలంగాణ ప్రజలు సన్మానం చేయాలని ఆలోచన చేస్తే వేగుల వారి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమరావతికి పారిపోయి వచ్చాడు. ఆయన అంత గొప్పవారు. ఆయనకు ఇంగ్లీష్‌ రాదనడం సమంజసం కాదు.చంద్రబాబు ఆలోచన విధానం ఏంటో అర్థం కావడం లేదు. పేకాట క్లబ్‌లు ఆపేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైయస్‌ జగన్‌ ఒక్కరే అని సవాలు చేస్తున్నాను.

 

సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ఒక యువకుడు ప్రయత్నిస్తుంటే దాన్ని హర్షించాల్సింది పోయి కాళ్లు పట్టుకొని లాగుదాం అనే విధానంలో ఉన్నారు. బార్లు కూడా 60 శాతం తగ్గించారు. బార్లు పెట్టాలంటేనే ఇబ్బందికరంగా ఉంది. మా విధానం ప్రజలను తాగుడు నుంచి మాన్పించాలన్నదే. ఇంత మంచి పనులు చేస్తున్న వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించమని ప్రజలను కోరుతున్నానన్నారు అంబటి రాంబాబు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: