చంద్రబాబు పాలనలోని అవినీతిని ఇప్పుడు వైసీపీ నేతలు ఎండగడుతున్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని లెక్కలతో చెబుతున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఎన్‌సీఈఏఆర్‌ ఎకనమిక్‌ రిసేర్చ్‌ 2016లో ఒక నివేదిక ఇచ్చింది. దేశంలో అవినీతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని నివేదిక ఇచ్చింది. సాక్షిలో రాసింది కాదు..వైయస్‌ఆర్‌సీపీ చెప్పింది కాదు. 2017లో సీఎన్‌ఎస్‌ కూడా దేశవ్యాప్తంగా సర్వే చేసి..చంద్రబాబు ప్రభుత్వం దేశంలో రెండో స్థానంలో ఉందని సర్వేలో చెప్పారన్నారు అంబటి.

 

అందుకే వైయస్‌ జగన్‌ లాంటి యువకుడు సీఎం కావాలని ప్రజలు చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా అమలు చేయాలని ఢృడసంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా చేయాలనే ధృఢ సంకల్పతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని హృదయపూర్వకంగా చెబుతున్నా అన్నారు అంబటి రాంబాబు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. " రాజకీయ అవినీతి ఉండటానికి వీల్లేదు. గతంలో బదిలీల్లో లంచాలు తీసుకునేవారు. పనుల్లో డబ్బులు తీసుకునేవారు. గతంలో ఆదినారాయణరెడ్డి అనే వ్యక్తిని చంద్రబాబు తన పార్టీలోకి తీసుకున్నారు. జమ్ములమడుగులో అప్పటికే ఉన్న టీడీపీ నేత రామసుబ్బారెడ్డికి చంద్రబాబు ఏం చెప్పారంటే..అవినీతిలో చేరో పావులా తీసుకోవాలని అప్పటి ముఖ్యమంత్రే పంచాయితీ చేస్తే..రాష్ట్రంలో ఎమ్మెల్యేలు దోచుకుంటే తప్పేంటి అనే దోరణిలో వ్యవహరించారు.

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అవినీతి అన్నది ముఖ్యంగా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్‌ వ్యాధి వంటిది. దీన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో గత ఐదేళ్లలో అవినీతి పరాకాష్టకు చేరింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతటి అవినీతి జరగలేదు. చంద్రబాబు ఎక్కడుంది అవినీతి అంటున్నారు. ఏపీలో అవినీతి సర్వం వ్యాపించింది. ఎక్కడ వ్యతికినా ఉందన్నారు అంబటి రాంబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: