జనసేన పార్టీ నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ వెళ్లిపోవడంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. రాజు రవితేజ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన వివరాలు ఇవీ.. జనసేన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ రాజు రవితేజ గారు పార్టీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాం.

 

ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నాము. గతంలో కూడా అయన ఇటువంటి బాధతోనే పార్టీని వీడి తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆయనకు మంచి భవిష్యత్తు, ఆయన కుటుంబానికి శుభం కలుగ చేయాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను.. అంటూ పవన్ పత్రికాప్రకటన విడుదల చేశారు.

 

 

ఇక రాజు రవితేజ్ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కూడా. అలాంటి రాజు రవితేజ్‌ అనుహ్యంగా పార్టీకీ గుడ్‌బై చెప్పారు. ఇకపై పవన్‌తో కానీ, జనసేన పార్టీతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని ఆయన ప్రకటించారు. తాను పార్టీ వీడేందుకు ఏర్పడిన పరిస్థితులను ఆయన వివరించారు. పవన్‌ ప్రవర్తన నచ్చకనే పార్టీని వీడుతున్నానని తెలిపారు.

 

ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్‌.. ప్రస్తుతం కక్షసాధింపుతనం, కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారని రాజు రవితేజ అన్నారు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి పవన్ ను ఏమాత్రం అనుమతించకూడదు అంటున్నారు రాజు రవితేజ్. పవన్‌ కల్యాణ్‌ ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాడంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: