ఈ లోకంలో ఉన్నవి రెండే రెండు కులాలు. అవి ఒకటి మచి కులం. రెండు చెడ్డకులం. మంచి తనంతో ఆలోచిస్తూ, మంచి పనులు చేస్తూ ఉన్న వర్గం వారు ఎప్పుడు అజ్ఞాతంగానే ఉంటారు. చెడు పనులు చేస్తూ, చెడు వ్యసనాలకు బానిసలైన వారు ఎప్పుడు నలుగురి నోట్లో నానుతూనే ఉంటారు.. ఇదే కాకుండా రకరకాల వ్యక్తులతో కలగలిసిన ఈ సమాజంలో కొంతమంది విచిత్ర వ్యక్తులు కూడా అడపాదడపా అక్కడక్కడ ఎవరికో ఒకరికి తగులుతూ ఉంటారు. వీళ్ళను ఎతిమతం మనుషులు అంటారు. అంటే ‘ఎడ్డెమంటే తెడ్డెమనే’ రకం.

 

 

వీళ్ళలో బాగా చదువుకున్నవాళ్ళు, మేధావులు, కళాకారులు కూడా ఉంటారు. ఇప్పుడు లోకంలో ప్రజలను ఎక్కువ ప్రభావితం చేసేవారిలో ఇలాంటి వారిని పేర్కొన వచ్చూ. ఇకపోతే ప్రజల మనసుల్లోనుండి హైదరాబాద్‌ దిశ ఘటన తాలూకు జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలేదు. బాధ్యత గల ప్రతి వారు మహిళల భద్రత కోసం గళం విప్పుతున్నారు. ఇదే కాకుండా దిశా హత్యాచారం నేపథ్యంలో ఏపీ కొత్తగా దిశ చట్టం కూడా తీసుకొచ్చింది.

 

 

ఐతే ఇంత జరుగుతున్నా సమాజంలో కామాంధులు అనబడే మగ మృగాలు మాత్రం మారడం లేదు. ఎందుకంటే ప్రతి నిమిషానికి లోకంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది వారి పెంపకంలోని దోషమా, లేక కన్నవారి తప్పా తెలియకుండా సమాజం రోజు రోజుకు మారుతుంది. ఇకపోతే నగరం నడిబొడ్డున మరో దారుణం జరిగింది. అదేమంటే పంజాగుట్ట ప్రాంతంలో నివసిస్తున్న అత్తపై అల్లుడు అత్యాచారం చేశాడు.

 

 

అది కూడా అతి దారుణంగా మత్తు మందు ఇచ్చి.. ఆమె నిద్రలో ఉన్న సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిద్ర నుంచి మేల్కొన్న బాధితురాలు జరిగిన విషయాన్ని గ్రహించి వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు... ఎంతగా పశువాంచతో రగిలే ఈ మృగాలను చట్టం శిక్షిస్తున్న కనీసం వీసమెత్తైన భయం వారి కంట్లో కనిపించడం లేదు. ఎందుకు సమాజం ఇంతలా మార్పు చెందుతుందో అర్ధం కావడం లేదని కొందరు బాద్యత గలవారు ఆలోచిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: