వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్ డీజిల్ ధరలు మిశ్రమంగా తగ్గాయి.. వరుసగా నెల రోజులు నుండి పెరుగుతున్న పెట్రోల్ ధర నిన్నటి నుండి ఒక్కసారిగా పడిపోయింది. డీజిల్ ధర స్థిరంగా కొనసాగగా పెట్రోల్ ధర మాత్రం అమాంతం పడిపోయింది. నెల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 80 రూపాయలకు చేరింది.

 

అయితే నేడు శనివారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 7 పైసల చొప్పున తగ్గింది. డీజిల్ ధర మాత్రం పెట్రోల్ కి వ్యతిరేకంగా అలాగే స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 7 పైసలు తగ్గుదలతో రూ. 79.26కు చేరగా, డీజల్ ధర గత నాలుగు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతుంది. ఇంకా విజయవాడలోని పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి.

 

దేశ రాజధాని అయిన ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మిశ్రమంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.59 శాతం తగ్గుదలతో 63.49 డాలర్లకు క్షీణించింది. మారో వైపు గత నెల రోజులలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్ ధరపై 4 రూపాయిలు పెరిగింది. దీంతో నెల రోజుల ముందు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర 10 పైసలు, 15 పైసలు ప్రకారం పెరిగి చివరికి 80 రూపాయలకు దగ్గరలో ఉంది. ఇంతలా రోజురోజుకు పెరిగే పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా నిన్నటి నుండి తగ్గుముఖం పట్టడంతో వాహనదారులు పండుగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: