నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు అయ్యింది.  నిర్ణయను మరీ దారుణంగా అత్యాచారం చేసి ఆమె మర్మాంగాల్లో పదునైన ఇనుప వస్తువులను ఉంచడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది.  వారం రోజులపాటు చికిత్స పొందుతూ నిర్ణయం మరణించింది.  నిర్భయ మరణం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. నిందితులను అప్పుడే పట్టుకున్నారు.  నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చి విచారణ జరిపారు. 


నిందితులకు ఉరిశిక్ష విధించారు.  వీరిలో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ళ జైలు శిక్ష తరువాత బయటకు రాగా, ఓ వ్యక్తి మాత్రం తీహార్ జైల్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  కాగా, నలుగురు ఇంకా జైల్లోనే ఉన్నారు.  వీరి ఉరికి సంబంధించిన కేసు పెండింగ్ లో ఉండటంతో జైల్లో ఉన్నారు.  ఈనెల 17 తరువాత ఈ ఉరిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.  ఇప్పటికే తీహార్ జైలు అధికారులు 10 ఉరితాళ్లు ఆర్డర్ ఇచ్చింది.  


ఇప్పటికే అవి రెడీఅయ్యాయి.  జైల్లో ఉరితీసే తలారి ప్రత్యేకంగా లేకపోవడంతో ఉరి ఎవరూ తీయాలి అనే దానిపై మల్లగుల్లాలు పడింది.  ఎట్టకేలకు ఇద్దరు తలారిలను తీసుకున్నారు.  అయితే, అందులో ఒకరికి అనారోగ్యంగా ఉండటంతో.. మరో తలారి జలాద్ తీసుకున్నది.  ఏ క్షణమైన జైలు నుంచి ఆయనకు పిలుపు రావొచ్చు.  మీరట్ కు చెందిన ఈయన గతంలో తలారిగానే పనిచేశారు.  


అయితే, ప్రస్తుతం మీరట్ లోనే ఉంటున్నాడు.  మీరట్ లో తలారి సిద్ధంగా ఉన్నాడని, ఆదేశాలు ఇవ్వడమే ఆలస్యం అని అంటున్నారు.  ఇక ఉరితీయాల్సిన వ్యక్తులు ఫలానా అని తనకు ఇంకా ఎలాంటి సమాచారం లేదని, నిర్భయ దోషులు అయ్యుంటుందని అయన అంటున్నారు.  అయితే, నలుగురు నిందితుల కోసమే 10 ఉరితాళ్లు సిద్ధం చేసిందా లేదంటే ఇంకా కొంతమందిని ఉరి తీసేందుకు కూడా ఒకేసారి తాళ్లు సిద్ధం చేసిందా అన్నది తెలియాలి. అత్యాచారం కేసుల్లో త్వరతిగతిన శిక్షలు విధించి వెంటనే ఉరి పడేలా చేస్తే తప్పకుండా దేశంలో ఇలాంటి అత్యాచారాలు తగ్గిపోతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: