కూతురు పెళ్లి కోసం అంతా సిద్ధం చేశాడు తన తండ్రి. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని ఓ అయ్య చేతిలో పెట్టాలని భావించాడు. అనుకున్నట్లుగానే పెళ్లి పూర్తి చేస్తాడు ఆ తండ్రి . బంధువులకు ఆశీర్వాదాలు కూడా అందించాడు. తన కూతురు తనను విడిచి వెళ్తుందని దుఃఖం... అత్తారింటికి వెళ్లి వివాహ జీవితాన్ని గడుప పోతుందనే ఆనందంతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు ఆ తండ్రి. వధూవరులను ఒక వాహనంలో కూర్చోబెట్టి వివాహ వేడుక మొదలైంది కానీ ఇంతలో విషాదం. చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచి ఓ అయ్యా చేతిలో పెట్టిన వధువు తండ్రి... ఇక తన భారం తీరిపోయింది అనుకున్నాడో ఏమో పెళ్లి వేడుకలో నే గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో మేకల దాసు అనే వ్యక్తి శుక్రవారం నాడు తన పెద్ద కూతురు పెళ్లి జరిపించాడు. అల్లారు  ముద్దుగా పెంచుకున్న తన కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు అందరూ వధూవరులకు ఆశీర్వచనాలు అందించారు. అంత సంతోషంగా గడిచిపోయింది. ఇక రాత్రి పెళ్ళి ఊరేగింపు మొదలైంది. తన కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టాను అని ఆనందంతో వధువు తండ్రి కూడా అందరిలాగే పెళ్లి వేడుకలో నృత్యం చేశాడు. కానీ ఇంతలో ఆ కుటుంబాన్ని పెను విషాదం కబళించింది. అందరూ ఎంతో ఆనందంగా పెళ్ళి ఊరేగింపులో  ముందుకు సాగుతున్నారు. 

 

 

 

 ఇంతలో పెళ్లి కూతురు తండ్రి దాసు సడెన్ గా  కిందపడిపోయాడు.నృత్యం చేస్తుండగా కాలు జారి పడ్డడేమో అని అంతా అనుకున్నారు. వెంటనే గ్రూపులో నుంచి పక్కకు తీసుకొచ్చి ఆయనను పడుకోబెట్టారు. అయితే దాసు స్పృహ కోల్పోవడంతో వెంటనే ఆయన్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు బంధువులు. అయితే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఈ ఘటన తో పెళ్లి లో ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. కూతురికి వివాహం చేసిన తండ్రి తన కూతురు తన దగ్గర నుంచి దూరం అవుతుందనే ఎక్కువ ఫీల్ అవ్వడం వల్ల గుండెపోటు వచ్చింది అంటూ బంధువులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: