దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై తెలంగాణ హై కోర్టుతో పాటుగా సుప్రీం కోర్టులోనూ పిటిషన్లు నమోదు అయ్యాయి. మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం సైతం ఎన్‌కౌంటర్ పై విచారణ జరిపింది. ఇదిలా ఉండగా నిన్న (డిసెంబర్ 13) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మహిళా భద్రతపై ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కేవలం 21 రోజుల్లోనే ఉరి శిక్ష పడే విధంగా విప్లవాత్మక దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. 

 

తెలంగాణలో జరిగిన దిశ ఘటనపై ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ "ఘటన జరగడం చాలా బాధాకరం, అమాయక యువతి దుర్మార్గుల వల్ల ప్రాణాలు కోల్పోయింది అటువంటి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు స్పందించిన తీరు అద్భుతం. ఈ సభ ద్వారా మళ్ళొకసారి నేను తెలంగాణ పోలీసులు, ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ చెప్తున్నా" అని పేర్కొన్నారు. 

 

"సినీమాల్లో మహిళలపై రేప్ చేసిన వాళ్ళని ఒక పోలీస్ ఆఫీసర్ చంపితే మనం చప్పట్లు కొడతాం అదే ఇక్కడ పోలీసులు చేస్తే మాత్రం ఆందోళనలు చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ పై ఏవేవో విచారణలు, ఏవేవో సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు, వీరంతా ఏం చేస్తారు?. వీళ్ళ ధోరణి చూస్తుంటే తప్పు చేసిన నిందితులది తప్పు కాదంటూ పోలీసులు వాళ్ళని  చంపడం మాత్రం తప్పంటా అన్నట్లు ఉంది. సిన్సియర్ పోలీర్ ఆఫీసర్స్ మీద ఇలాంటి విచారణలు వేసి వాళ్ళని హింసిస్తే ప్రజల్లో తప్పుడు భావన వెళ్తుంది. చట్టం, న్యాయం లేదనే భావన ప్రజల్లో కలుగుతుంది ఇదే ఘటన భవిష్యత్లో జరిగితే ఏ పోలీస్ ఆఫీసర్ అయిన ఘటనపై కఠినంగా వ్యవహరించడానికి సంశయం వ్యక్తం చేసే అవకాశం ఉంది" అని సీఎం జగన్ చెప్పారు. 

 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది అందుకే దిశ చట్టాన్ని తెస్తున్నాం అని సీఎం పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: