హైదరాబాద్ షాద్నగర్  దిశ ఘటన  తర్వాత దేశం మొత్తం మహిళల  భద్రత కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తుంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మహిళల రక్షణ కోసం కీలక ప్రకటన చేసింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల ఘటనపై సత్వర  విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చేయడానికి సరికొత్తగా చట్టాన్ని తీసుకొచ్చింది ఏపీ సర్కార్. తాజాగా ఈ చట్టానికి  సంబంధించిన బిల్లును ఏపీ అసెంబ్లీ లో ప్రవేశపెట్టగా అక్కడ ఏపీ అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా దిశ చట్టానికి ఆమోదం తెలిపింది. కాగా జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన దిశా చట్టం పై  దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన చట్టం వల్ల ఆడపిల్లలకు  న్యాయం జరుగుతుందని నమ్మకం ఏర్పడిందని పలువురు భావిస్తున్నారు. 

 

 

 

 అయితే దిశ చట్టంలోని పలు ముఖ్య అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం... దిశ చట్టం రెండు రకాలుగా ఉంటుంది. అధికారికంగా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టం 2019, ఇక రెండవది ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్  కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫన్సెస్ అగైనెస్ట్  ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2019... వీటినే సింపుల్గా దిశ చట్టం అంటారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన నిర్భయ చట్టం ప్రకారం అత్యాచారం చేసిన నిందితులకు జైలు శిక్ష లేదా ఉరిశిక్ష విధించే వారు. కానీ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ప్రకారం అత్యాచారాలు చేసిన వారికి ఉరిశిక్ష తప్పదు. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి తర్వాత రెండు నెలల్లో శిక్ష పడేలా చేయాలి... కానీ దిశ చట్టం ప్రకారం 11 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 21 రోజుల్లో ఉరిశిక్ష పడేలా చర్యలు చేపడతారు. అయితే చిన్నపిల్లలపై అత్యాచారానికి పాల్పడితే కేంద్రం తీసుకువచ్చిన పోక్సో చట్టం ప్రకారం మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. కానీ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన దీక్ష చట్టం ప్రకారం పిల్లలపై ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులకు జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష విధించడం తప్పదు. 

 

 

 

 అంతేకాకుండా పోక్సో చట్టం ప్రకారం ఏడాది లోపు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది... కానీ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టప్రకారం చిన్న పిల్లలపై అత్యాచారాలు జరిగినా కేసుల్లో కేవలం ఏడు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి 14 ఈ రోజుల్లోనే  నిందితులకు శిక్ష పడాల్సిందే. అంతేకాకుండా మహిళ పై సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రాతలు రాసిన... అసభ్యంగా ప్రవర్తించిన దిశ ఆక్ట్ ప్రకారం అలాంటి వారికి మొదటి సారి 2ఏళ్ళు జైలు శిక్ష ... రెండోసారి అలాంటి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించక తప్పదు.  దిశ చట్టం 2019 ప్రకారం ప్రతి జిల్లాలో ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టును  ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కోర్టు రేప్,  యాసిడ్ అటాక్,  సోషల్ మీడియాలో వేధింపులు ఇలాంటి నేరాలను విచారిస్తుంది. ఇక నిర్భయ చట్టం లో కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు కు వెళ్లేందుకు ఆరునెలల సమయం ఉండగా.. దిశ చట్టం ప్రకారం ఆ సమయం మూడు నెలలు మాత్రమే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: