జనసేన అధినేత పవన్ కల్యాన్ సమాజానికి చాలా ప్రమాదకరంగా తయారయ్యారా ? పవన్ కు అత్యంత సన్నిహితుడు, జనసేన ఏర్పాటులో కీలక వ్యక్తి అయిన రాజు రవితేజ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ జనసేన పార్టీ పెట్టటంలో రవితేజే చాలా కీలకం. పార్టీ భావజాలం, మ్యానిఫెస్టో ఏర్పాటులో రవితేజ  ప్రధాన వ్యక్తి. అలాంటి  సన్నిహితుడే పార్టీకి, పాలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసేశారు.

 

తన రాజీనామా లేఖలో పవన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దాని ప్రకారం సమాజానికి పవన్ ప్రమాదకరంగా మారిపోయినట్లు మండిపడ్డారు. పవన్ ఒకపుడు మంచి వ్యక్తిగానే ఉన్నారట. కానీ ఈమధ్య కాలంలోనే  కక్షసాధింపుతనం, కుల, మతపరమైన ధ్వేషంతో నడిచే ప్రమాదకరమైన  విభజన శక్తిగా మారిపోయినట్లు ఆరోపించారు.

 

అందుకనే రాజకీయ లేకపోతే సామాజిక శక్తి ఉన్న పదవిని అందుకోవటానికి పవన్ ను అనుమతించకూడదు అంటూ ముందు జాగ్రత్తగా హెచ్చరించారు.  మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత పవన్ వైఖరిలో ఒక్కసారిగా వచ్చిన మార్పును అందరూ గమనిస్తునే ఉన్నారు.  పోటి చేసిన రెండు నియోజకవర్గాలో ఓడిపోవటం, తాను ఓడిపోవటమే కాకుండా చంద్రబాబునాయుడు కూడా ఘోర ఓటమితో పవన్ మండిపోతున్నారు.

 

తామిద్దరినీ దారుణంగా ఓడించిన జగన్మోహన్ రెడ్డిపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. అదే సమయంలో ఈమధ్య ఢిల్లీకి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి జగన్ కు వ్యతిరేకంగా అయినదానికి కానిదానికి రెచ్చిపోతున్నారు. తెలంగాణాలో జరిగిన ఘటనలను, చంద్రబాబు హయాంలో జరిగిన వాటిని కూడా జగనే బాధ్యుడని ఆరోపించటమే ఇందుకు నిదర్శనం.

 

ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను వదిలిపెట్టి కేవలం చిన్న చిన్న లోపాలను బూతద్దంలో మాత్రమే పవన్ చూస్తున్నారు. రెండు రోజుల క్రితమే చేసిన రైతు సౌభాగ్య దీక్షలో ధాన్యానికి రూ. 1500 గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. విచిత్రమేమిటంటే అప్పటికే రూ. 1815 గిట్టుబాటు ధరగా కల్పిస్తు జగన్ ప్రకటన చేశారు. అంటే జగన్ పై గుడ్డి వ్యతిరేకతే లక్ష్యంగా పవన్ రాజకీయాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇటువంటి వైఖరినే రవితేజ వ్యతిరేకించారు. అందుకనే పవన్ సమాజానికే ప్రమాదకర వ్యక్తిగా తయారయ్యారంటూ మండిపడ్డారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: