విలక్షణ నటుడు బహుముఖప్రజ్ఞాశాలి ప్రకాశ్ రాజ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్ర అయినా అది ప్రకాష్ తప్ప మరొకరు చేయలేరేమో అనేంతగా పాత్రల్లో ఒదిగిపోయి నటిస్తూ ఉంటాడు. ఒక బాధ్యత గల తండ్రిగా... ఓ పవర్ఫుల్ విలన్ గా... కామెడీ పంచె  ఒక కమెడియన్గా.. ఒక తాతగా... ఇలా ఏ పాత్ర ఇచ్చినా తన విలక్షణమైన నటనతో నిజంగా నిజజీవితంలో కూడా ఆ పాత్ర ఇలాగే ఉంటుందేమో అనేలా పాత్రను ప్రభావితం చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్ . ఇక దర్శకుల ఎలాంటి విలక్షణమైన పాత్ర ఉన్న దానికి కేరాఫ్ అడ్రస్ ప్రకాష్ రాజ్ మాత్రమే. ఇప్పటికే ఒక్క తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి తన విలక్షణమైన నటనతో ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు ప్రకాష్ రాజు. 

 

 

 

 ఒకప్పుడు ఏ సినిమాలో చూసినా ప్రకాష్ రాజ్  కనిపించే వాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్రలో ప్రకాష్ రాజ్ తన నటనతో మెప్పించే వాడు. కానీ గత కొంతకాలంగా ప్రకాష్  రాజ్  కి అవకాశాలు తగ్గిపోయాయి. అసలు ఎక్కడ ప్రకాష్ రాజ్  ఊసేలేదు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఓ  సినిమాలో నటిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తో పాటు రమ్యకృష్ణ నటిస్తుంది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు కృష్ణవంశీ... విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మంచి స్నేహితులు. కాగా ప్రస్తుతం వీరిద్దరు కలిసి రంగమార్తాండ సినిమాలో చేస్తున్నారు. 

 

 

 

 ప్రకాష్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో  పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది కూడా. అయితే రంగ మార్తాండ సినిమాకు కేవలం ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించడమే కాదు అటు దర్శకుడికి  పలు సలహాలు ఇస్తూ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా మారిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి దర్శకుడు కృష్ణవంశీకి పలు సూచనలు సలహాలు ఇస్తున్నారట ప్రకాశ్ రాజ్ . కాగా చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న  ఈ సినిమా ద్వారా ముందులా మల్లి తన హావ మొదలు పెడతాడా  లేదా  చూడాలి మరి. కాక రంగ మార్తాండ సినిమాలో బిగ్ బిగ్బాస్ తెలుగు సీజన్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఓ పాత్రలో నటించబోతున్నారన్న  విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: