తెలంగాణ‌లో జ‌రిగిన దిశ ఘటన దేశాన్ని కుదిపితే, ఏపీ అసెంబ్లీని కదిలించింది. ఫలితమే ఏపీ దిశా యాక్ట్‌–2019. శుక్రవారం ఏపీ అసెంబ్లీ ‘దిశ’ బిల్లును ఆమోదించడంతో రాష్ట్రానికి కొత్త మహిళా రక్షణ చట్టం ఒక కవచం అయింది. ఈ చట్టం రాష్ట్రంలోని మహిళలకు, బాలికలకు భద్రత కల్పిస్తుంది. వారిపై జరిగే నేరాల విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతాయి. మహిళలపై అత్యాచారానికి, క్రూరమైన అకృత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష పడుతుంది. వారం రోజుల్లో దర్యాప్తు, పద్నాలుగు రోజుల్లో విచారణ, మూడు వారాల్లో తీర్పు పూర్తవుతాయి! అయితే, స‌హ‌జంగానే ఈ చ‌ట్టం...దిశ ఘ‌ట‌న జ‌రిగిన తెలంగాణ‌పై ఒత్తిడి పెంచుతోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో...దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ వ‌లే...మ‌రో ముగ్గురు నిందితులు సైతం క‌న్నుమూయ‌నున్నార‌ని అంటున్నారు. 

 

కేసీఆర్ ఏడాది స‌ర్కారు...విజ‌య‌శాంతి అదిరిపోయే రివ్యూ

తెలంగాణ‌లో ఇటీవ‌లి కాలంలో మూడు దారుణ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో మూడేళ్లలో నలుగురు బాలికలను శ్రీనివాస్ రెడ్డి అనే వ్య‌క్తి దారుణంగా హత్య చేశాడు. బాలికలపై అత్యాచారం చేసి.. హత్య చేశాడు. ఆ తర్వాత పాడుబడ్డ బావిలో వారిని పూడ్చి పెట్టాడు. బొమ్మలరామారం పోలీసులు హత్యలకు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించటంతో.. రెండు నెలల్లోనే విచారణ పూర్తిచేసింది కోర్టు. ఇప్పటికే హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి.. వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే, ప్ర‌జ‌ల డిమాండ్ మేర‌కు ఈయ‌న కూడా ఎన్‌కౌంట‌ర్ అవుతాడ‌ని...సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

మ‌రోవైపు ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌లో మానవ మృగాల చేతిలో అత్యాచారం, హత్యకు గురైన సమత విష‌యంలోనూ...ఇదే డిమాండ్ తెర‌మీద‌కు వ‌స్తోంది. స‌మ‌త‌ ఆత్మ శాంతించాలంటే ఆ ముగ్గురు నిందితులకు ఉరి శిక్ష పడాలని, లేదంటే ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని సమత భర్త కోరారు. తన భార్యను ముగ్గురు తాగుబోతులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని కంటతడి పెట్టుకున్నాడు.

 

ఇక హ‌న్మ‌కొండ‌లో పుట్టినరోజు నాడే యువ‌తి మాన‌ అనుమానాస్పద మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. జనగాం జిల్లా, ఘన్‌పూర్‌ మండలం నెమలి గొండ్ల గ్రామానికి చెందిన సాయికుమార్‌ హంటర్‌రోడ్‌లోని ఓ ప్రవైయిట్‌ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు మానస హంటర్‌రోడ్డులోని నీలమ జంక్షన్‌ వద్ద తండ్రితో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూనే ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నది. నిందితుడు కాలేజీకి వచ్చిపోయే క్రమంలో గత ఆరు నెలల క్రితం మానసతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరూ తరచుగా పోన్‌లో మాట్లాడుకునేవారు. ఆ ప‌రిచ‌యంతోనే దారుణంగా హ‌త్య చేశాడు. కాగా ఈ మూడు హ‌త్య‌ల్లో నిందితుల‌కు... ఎన్‌కౌంట‌ర్ మ‌ర‌ణ‌మే మంచిద‌ని అంటున్నారు. దీంతో...దిశ నిందితుల‌కు ప‌డిన శిక్షే వీరికి ఖాయ‌మ‌ని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: