హైదరాబాద్ షాద్నగర్ లో నలుగురు నిందితులు అతి దారుణంగా వెటర్నరీ డాక్టర్ దిశను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది. అత్యాచారాలు చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడక పోవడం వల్లే అత్యాచారాలు చేయడానికి కూడా భయపడం లేదంటూ మహిళా లోకం మొత్తం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే నిందితులకు ఉరిశిక్ష వేసి  చంపేయాలంటూ డిమాండ్ చేసింది మహిళలు లోకం. దీని కోసం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తాయి. కాగా చివరికి దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. 

 

 

 

 కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం హత్య కేసులో మరో ఆధారం బయటపడింది. బాధితురాలు దిశ మృతదేహం లో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యింది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంటే దిశ పై అత్యాచారం చేయడానికి ముందు నలుగురు నిందితులు కలిసి ఆమెను బలవంతంగా మద్యం తాగించారు అన్న విషయం ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించిన వివరాలను బట్టి పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నప్పుడు సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని తెలిపారు. అత్యాచారం చేసుకున్న సమయంలో నిందితులు ఫుల్ గా తాగి ఉండడమే కాకుండా దిశా కి కూడా బలవంతంగా మద్యం తాగించారు అంటూ వివరణ ఇచ్చారు. 

 

 

 

 అంతేకాకుండా పోలీసు విచారణలో నిందితులు కూడా వాంగ్మూలంలో  ఈ విషయాన్ని తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నివేదిక కూడా గుర్తించింది. కాగా పోలీసులు నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయగా... ప్రస్తుతం ఎన్ కౌంటర్లపై విచారణ కొనసాగుతోంది. దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై  సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక కమిటీని దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారణ చేపట్టేందుకు నియమించింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దిశ ఎన్ కౌంటర్లపై విచారణ చేపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: