రెండు రోజుల క్రితం అసెంబ్లీ గేటు దగ్గర చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో కు మార్షల్స్ తో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే.  ప్రజాసమస్యలపై నిరసన తెలపటానికి టిడిపి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో గొడవ జరగలేదన్న విషయం తాజాగా బయటపడింది.  ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారమే మార్షల్స్ తో చంద్రబాబు అండ్ కో గొడవ పడినట్లు సమాచారం.

 

అసలు మార్షల్స్ తో చంద్రబాబు, చినబాబు గొడవ పడాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే వాళ్ళకేమీ రాలేదు. వచ్చిందల్లా ఎల్లోమీడియాకేనట.  అసలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన చంద్రబాబు మండిపోతున్నారు. దానికితోడు ఎల్లోమీడియా కూడా మంటెక్కిపోతోంది. అసెంబ్లీ లైవ్ కవరేజి విషయంలో ఎల్లోమీడియాను దూరంగా పెట్టేయటం, అసెంబ్లీ లోకి  మీడియాపై ఆంక్షలు విధించటం లాంటి వాటితో ఎల్లోమీడియాకు జగన్ పై మండిపోతోంది.

 

ప్రభుత్వంపై తమకున్న కసిని ఎంతగా బయటపెట్టుకుంటున్నా ఎల్లోమీడియాను జగన్ ఏమాత్రం లెక్క చేయటం లేదు. దాంతో  టిడిపిని అడ్డుపెట్టుకుని జగన్ ను గబ్బు పట్టించాలని ప్లాన్ వేసినట్లు అమరావతి వర్గాల సమాచారం. ఇందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. దాని ఫలితమే అసెంబ్లీ గేటు దగ్గర చంద్రబాబు, చినబాబు మార్షల్స్ తో గొడవపడటం.

 

నిజానికి అసెంబ్లీలోకి  చంద్రబాబు ఎంటరవ్వాల్సింది గేటు నెంబర్ 2 నుండి. కానీ అదే పనిగా ఎంఎల్ఏలు ప్రవేశించే గేటులో నుండే తాను కూడా ఎంటరవ్వాలని చంద్రబాబు ప్రయత్నించారు. అదికూడా పెద్ద ప్రదర్శనగా వచ్చి. అంటే ప్రదర్శనలో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలే కాకుండా పార్టీ నేతలు కూడా ఉన్నారు. అందుకనే మార్షల్స్ ముందు జాగ్రత్తగా గేట్లు మూసేశారు. చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదే.

 

ఎందుకంటే చంద్రబాబు ఏ గేటులో నుండి ఎంటరవ్వాలి ?  గేట్లేసేసిన మార్షల్స్ తో ఎలా గొడవపడాలి, చినబాబు ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేయాలనే విషయాలను ముందుగానే ఎల్లోమీడియా రిపోర్టర్లు చంద్రబాబు, చినబాబు, టిడిపి ఎంఎల్ఏలకు బ్రీఫారట. దాని ప్రకారమే గేట్ల దగ్గర  మార్షల్స్ తో చంద్రబాబు, చినబాబు, టిడిపి ఎంఎల్ఏలు గొడవపడ్డారు. మార్షల్స్ తో జరిగిన గొడవలో ఎవరి పరువు పోయిందన్నది వేరే విషయం. ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు, చినబాబులకు ఎల్లోమీడియా ఏ స్ధాయిలో డైరెక్షన్ చేసిందో అర్ధమైపోతోందని అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: