సినిమాలతో తెలుగు ప్రేక్షకులందరికీ రాములమ్మ గా మారిన విజయశాంతి అటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. అధికార పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ... అధికార పార్టీ అసమర్ధతను ఎండగడుతూ  వచ్చింది విజయశాంతి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా విజయశాంతి కొనసాగిస్తున్నారు. కాగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయశాంతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ సర్కార్ సంవత్సర పాలన కు గాను ఆసక్తికర రివ్యూ  ఇచ్చారు విజయశాంతి. 

 

 

టిఆర్ఎస్ కు పోటీగా ఎన్నికల్లో ఖర్చు చేసే విషయంలో జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు సైతం ముందు నిలువలేక పోతున్నాయి అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ సమాజం మొత్తం ఇది అనుకుంటుంది అని ఆమె అన్నారు. మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయినడని... ఇలా  చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ  విమర్శించారు. అధికారులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన దుబారా ఖర్చులు గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో ప్రజల సెంటిమెంట్ను తనకు అనుకూలంగా మలుచుకుని... ముఖ్యమంత్రి కేసీఆర్ తాను చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ విజయశాంతి విమర్శించారు. 

 

 

 ఇన్ని రోజులు వరకు ప్రజలకు మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకునే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ఖజానా ముంచేసి .. దుబారా ఖర్చులు చేశారని విమర్శించారు. ఇప్పుడు చివరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై నిజాలు ఒప్పుకోక తప్పలేదు  అంటూ ఆమె సెటైర్ వేశారు. కెసిఆర్ నిజస్వరూపం వెలుగులోకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి విజయశాంతి వ్యాఖ్యానించారు. ఆరోజు కోసమే తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారు అంటూ  తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా విమర్శలు గుప్పించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి: