ఘటన జరిగి 20 రోజులు అయినా ఇంకా ఆ ఘటనను మరవలేక పోతున్నాం. రోజుకో సంచలనం దిశ నిందితుల గురించి బయటపడుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. వెటర్నరీ వైద్యురాలైన దిశను అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమెను సజీవదహనం చేశారు నలుగురు నీచులు. కనీసం ఆమె శరీరాన్ని ముట్టుకోనీకి కూడా లేకుండా పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు ఆ నీచులు. 

 

దీంతో యావత్ దేశం ఒక్కసారిగా కోపాన్ని పీకల మీదకు తెచ్చుకుంది. ఆ నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చెయ్యగానే.. ప్రజలంతా ఒక్కసారిగా వచ్చి ఆ నీచులను మాకు అప్పగించండి మేము చంపేస్తాం అంటూ కామెంట్లు చేశారు. దీంతో పోలీసులు ఆ నీచులను కేసు రేకంస్ట్రక్షన్ అంటూ ఘటన స్థలానికి తీసుకురాగా.. 

 

అక్కడ ఆ నీచులు పారిపోవడానికి ప్రయత్నించి పోలీసులపైనే దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నీచులపై ఎన్కౌంటర్ జరిపి చంపేశారు. ఎన్కౌంటర్ కు గురైన ఆ నీచులు అక్కడే చచ్చారు.. వాళ్ళు చావడంతో ఆగ్రహంతో ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కాస్త శాంతించారు. అయితే దేశం అంత శాంతంగా ఉన్న.. ఆ నలుగురు నిందితుల ఇళ్లలో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. 

 

అయితే ఈ విషాదంతో ఆ నలుగురు నిందితుల కుటుంబంలో ఒకరైన చెన్నకేసువులు భార్య రేణుక అనే ఆమె భర్త పోతే పోయాడు.. నాకు ఓ పది లక్షల ఇల్లు.. డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అయినా ఇప్పియండి మాకు న్యాయం చెయ్యండి అంటూ రోడ్డెక్కి నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ భార్య విషయంలో మరో సంచలమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సంచలన విషయం ఏంటి అని అనుకుంటున్నారా ? ఎన్కౌంటర్ లో గురైన ఆమె భర్త ఓ మైనర్. ఆమె కూడా ఓ మైనర్ అని తేలింది. 

 

అయితే ఆ మైనర్ భార్యకు ప్రభుత్వం సహాయం చెయ్యాలని ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు ఓ కథనం రాసింది. నిజమే చెయ్యాలి. కానీ ఆమె భర్త ఏమైనా దేశం కోసం పోరాడి చచ్చాడా నీచుడు ? ఆడపిల్లను పాశవికంగా రేప్ చేసి చచ్చాడు. అందుకే ఎన్కౌంటర్ కు గురయ్యాడు. సరే.. ఎన్కౌంటర్ పక్కన పెట్టండి.. ఆమె మైనర్.. అసలు అంత చిన్న వయసులో వివాహం ఎందుకు ? ఆలా వివాహం చేసుకున్నందుకు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెకు మరో జీవితం అందించండి కానీ పరిహారం మాత్రం ఇవ్వదు అని నెటిజన్లు ఆ కథనానికి రిప్లై ఇచ్చారు. మరి మీరు ఏమంటారు ?  

మరింత సమాచారం తెలుసుకోండి: