'రేప్స్ ఇన్ ఇండియా' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. నిన్న (డిసెంబర్ 13న) రాహుల్ గాంధీ మాట్లాడుతూ, పౌరసత్వ చట్టం కారణంగా విస్తృతంగా హింసకు గురవుతున్న ఈశాన్య రాష్టాల నుంచి దృష్టిని మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ చెప్పారు. 

 

"నా వద్ద మన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన ఒక క్లిప్ ఉంది, ఇందులో నరేంద్ర మోడీ గారు ఢిల్లీని 'రేప్ క్యాపిటల్' అని పిలిచారు. ఈశాన్యంలో నిరసనల నుండి దృష్టిని మరల్చటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది" అని రాహుల్ విలేకరులతో అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న నిరసనకు, దేశ ఆర్థిక వ్యవస్థను 'నాశనం' చేసినందుకు మరియు ఢిల్లీని అత్యాచార రాజధానిగా పేర్కొన్నందుకు మోడీ క్షమాపణ చెప్పాలని రాహుల్ తన ట్వీట్‌లో కోరారు.

https://mobile.twitter.com/RahulGandhi/status/1205388149498580992

"మేక్ ఇన్ ఇండియా గురించి మోడీ మాట్లాడినప్పుడు, మేక్ ఇన్ ఇండియా గురించి వార్తాపత్రికలు నిండి ఉంటాయని మేము అనుకున్నాము. కాని ఇప్పుడు మనం వార్తాపత్రికలు తెరిచి చూస్తే, 'రేప్స్ ఇన్ ఇండియా' గురించి మాత్రమే చదువుతున్నాం" అంటూ రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు. రాహుల్ కామెంట్స్ పై నిన్న పార్లమెంటు ఉభయ సభలలో బిజెపి సభ్యులు తీవ్ర ఆందోళనలు చేశారు, ప్రధాని నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' నినాదాన్ని 'రేప్స్ ఇన్ ఇండియా' అని పేర్కొన్నందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

రాహుల్ గాంధీని సమర్థిస్తూ, డిఎంకె ఎంపి కనిమోళి మాట్లాడుతూ "మేక్ ఇన్ ఇండియా" అని ప్రధాని అన్నారు, ఇది మేము గౌరవిస్తాము, కాని దేశంలో ఏమి జరుగుతోంది? రాహుల్ గాంధీ చెప్పదలచుకున్నది అదే. దురదృష్టవశాత్తు 'మేక్ ఇన్ ఇండియా' సంభవించట్లేదు మహిళలపై దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం" అని పేర్కొన్నారు. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని ఢిల్లీని రేప్ క్యాపిటల్ గా పేర్కొంటే తప్పులేదు కానీ ప్రస్తుత దేశంలో నేను జరుగుతున్న విషయాన్ని చెప్తే తప్పొచ్చిందా, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: