ప్రేమికులైన..కపుల్స్ అయిన  వారి మధ్య అనుబంధం బలపడాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి  ఉంటుంది. అయితే ఈ రోజుల్లో  మాత్రం ప్రేమికులు కపుల్స్ మధ్య తరచూ గొడవలు అవుతూ ఉండటం చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉండడం.. ఒకరి గురించి ఒకరికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. ఇక తమ మధ్య ప్రేమతో సాగాల్సిన జీవితాన్ని గొడవలతో సాగించేస్తూ  ఉంటారు. అయితే ఇలాంటి వారి కొన్ని చిట్కాలు పాటిస్తే కపుల్స్ అయినా ప్రేమికులైన వారి మధ్య ఉన్న బంధం మాత్రం బలపడుతుంది. సాధారణంగా చాలామంది బంధం మొదట్లో ఉన్నంత అన్యోన్యంగా చివరివరకు ఉండరు.. అలా ఉండడానికి ఇలాంటి చిట్కాలు పాటిస్తే బంధం బలపడుతుందని చెబుతున్నారు నిపుణులు. 

 

 

 అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మీరు మీ పార్టనర్ తో ఎక్కువ సమయం గడపడం పోతే దాన్ని మార్చుకుంటే మంచిది.ఎట్టి పరిస్థితుల్లో సమయం కల్పించుకొని మీ పార్టనర్ తో  ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా మీ పార్ట్నర్ తో అన్ని విధాలుగా డిస్కస్ చేయాలి. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడమే కాకుండా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఏ  రిలేషన్ షిప్ లో అయినా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా ముఖ్యం.. మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో   అనే ప్రశ్నలు ఇద్దరి మధ్య తలెత్తే చాలా మంచిది. దీని ద్వారా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ రోజు ఏం చేద్దాం ఎలాంటి ప్లాన్ వేసుకుందాం  అనే ప్రశ్నలు అడగడం కూడా చాలా ముఖ్యం. 

 

 

 కొంతమంది ఎదుటివారికి  అదేపనిగా సలహాలు ఇస్తూ ఉంటారు... అవసరం లేకపోయినప్పటికీ సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు.అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏదైనా విషయంలో  అడిగినప్పుడు సలహా ఇస్తే మంచిదే... కానీ ఉచిత సలహాలు ఊరికే ఇస్తే మాత్రం కాస్త మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సలహాలను ఇవ్వకపోవడమే మేలు. ఏదైనా మీకు సంబంధించిన విషయంలో మీ పార్ట్నర్ మధన పడుతూ ఉంటే ఆ విషయాన్ని అడిగి తెలుసుకోవడం మేలు. ఎందుకంటే అలా తెలుసుకోవడం వల్ల మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉంటుంది. లేకపోతే చిన్న విషయం కాస్త పెద్ద గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. రొమాన్స్ అంటే అదొక పెద్ద బూతు పదం అని భావించకుండా... మీ పార్ట్నర్ తో కాస్త రొమాంటిక్గా కూడా ఉంటే మంచిదే. దీని వల్ల రిలేషన్ షిప్ మరింత బలపడి ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: