పవన్‌ కళ్యాణ్ సన్నిహితుడు, జనసేన పొలిట్‌ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ్ జనసేన పార్టీకి అనుకోని సంఘంటనల మధ్య రాజీనామా చేశారు. ఇక నుంచి పవన్‌ కళ్యాణ్ తో కానీ, జనసేన పార్టీతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండదని అయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తనకు ఇష్టం లేకపోయినప్పటికీ పొలిట్ బ్యూరోలో తాను చేరానన్నారు. పవన్‌ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకపోవడంతోనే ఆ పార్టీని వీడుతున్నానని రవితేజ్ తెలిపారు. ఈమేరకు రాజు రవితేజ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

 

 


పార్టీ భావజాలం, రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ఆరంబించడంలో కీలక పాత్ర పోషించాను. జనసేన మెదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాన తాను ప్రస్తుతం నేను పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిని. పవన్‌ కోరిక మేరకు నాకు ఈ పదవి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. ఇక మీదట నేను పవన్ కళ్యాణ్‌ తో, జనసేన పార్టీతో కలిసి పని చేయను. ఒకప్పుడు మంచి వ్యకైన పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం కక్ష సాధింపుతనం, కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారు అని అయన వ్యాఖ్యానించారు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి అతణ్ని అనుమతించకూడదు, అలాగే పవన్‌ ఎలాంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదు అని రాజు రవితేజ్‌ తన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత లేకుండా పొందింది, అనుమతి లేకుండా వెళ్లిపోతుంది అని ఆయన అన్నారు.

 

View image on Twitter

 


రాజు రవితేజ్ రాజీనామాను జనసేన పార్టీ కూడా ఆమోదించింది. ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నామని జనసేన పార్టీ తెలిపింది. గతంలో కూడా ఆయన ఇలాంటి బాధతోనే పార్టీని వీడి తిరిగి వచ్చారని వారు పేర్కొన్నారు. ఆయనకు మంచి భవిష్యత్తు, ఆయన కుటుంబానికి శుభం కలగాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేరిట ప్రకటనను విడుదల చేశారు జనసేన పార్టీ కార్యవర్గం.

 

పవన్ కళ్యాణ్ గతంలో "ఇజం" పేరిట పుస్తకాన్ని వెలువరించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పుసక్తాన్ని పవన్ కళ్యాణ్, రాజు రవితేజ్ కలిసి రచించారు. తెలంగాణలో వరంగల్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆయన పవన్‌ కు అత్యంత సన్నిహితుల్లో చెప్పుకోదగ్గవారు. జనసేన పార్టీ ఏర్పాటులో ఆయన కీలక పాత్రనే పోషించారు. ‘నా వెనుక డబ్బున్న వారు, రాజకీయ నాయకులు ఎవరు లేరు. రాజు రవితేజ ఒక్కరే ఉన్నారు అని జనసేన పార్టీ ప్రకటన చేస్తూ పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన పవన్‌ కు ఎంత సన్నిహితుడో అర్థం అవుతుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించగా, అదే సమయంలో రాజు రవితేజ్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: