దాదాపు 12 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా హత్యాచారానికి గురైంది. హత్యాచారం జరిగి 12యేళ్లు  అయినా ఇంకా తమకు న్యాయం జరగలేదు అంటూ అయేషా తల్లి సిబిఐ ని ఆశ్రయించింది ప్రస్తుతం కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది.  ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం కాగా, పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకున్న నేపథ్యంలో సత్యం బాబును అరెస్ట్ చేశారు.

 

విచారణ అనంతరం దిగువ కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించగా, 2017లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కాగా, ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసమైనందున, తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి సవాల్గా మారింది. దీంతో రీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. దీనికి కోర్టు అనుమతి ఇవ్వడంతో శనివారం పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆయేషా తల్లిదండ్రులకు కూడా డీఎన్‌ఏ టెస్ట్‌ చేసినట్లు సమాచారం. 


ఈ సందర్భంగా ఆయేషా తల్లి మాట్లాడుతూ.. సీబీఐ దర్యాప్తుతోనైనా తమకు  న్యాయం జరుగుతుంది అనుకుంటున్నామని అన్నారు. అంతేకాదు, ప్రాంతీయ, కులతత్వం, హోదా, డబ్బువల్లే తమ కుమార్తె కేసులో న్యాయం జరగటం లేదు అని . గతంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసినా  దాని వాళ్ళ కూడా న్యాయం జరగలేదని అన్నారు. ఆయేషా కేసులో పోలీసులే నిందితులని ఆమె అన్నారు. నిర్బయ చట్టం తీసుకొచ్చారని దాని వల్ల ఎలాంటి ఉపయోగంజరిగింది అని మాట్లాడారు . దేశం ధనికులు, పేదలు అనే రెండు వర్గాలుగా చీలిపోయిందన్నారు. 

 

యాసిఫ్ అనే ఎనిమిదేళ్ల పాపను దారుణంగా హత్యచేసినా చర్యలు తీసుకోలేదన్నారు.ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ చట్టం తీసుకొచ్చారని, 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు.. ఆనాడు ఆయేషా మీరా కేసులో ఎందుకు 21 రోజుల్లో శిక్షవేయలేదని ఆమె నిలదీశారు.. తన కుమార్తె పేరుతో ఆయేషా చట్టాన్ని కూడా జగన్ తీసుకురాగలరా? అని ప్రశ్నించారు.ఈ కేసులోనూ నేరస్థులను పట్టుకుని, సీబీఐ ద్వారా శిక్ష వేయిస్తే చాలా సంతోషిస్తామని అన్నారు. ఆలా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేయకలిగిన రోజు న మేము ఆయను అభినందిస్తాం అని అయేషా తల్లి మాట్లాడారు .
 

మరింత సమాచారం తెలుసుకోండి: