జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశ పెడుతూ  సర్కార్ పై ప్రజల్లో నమ్మకం కలిగింది జగన్ సర్కార్. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఏ  రాష్ట్రంలో లేని కనీవినీ ఎరుగని పథకాలను ప్రవేశపెడుతూ పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజాసంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా వెనకాడడం లేదు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి లో మాకు జగన్ అన్న ఉన్నాడు అనే ధీమా  కలిగిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. 

 

 

 అయితే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రవేశపెడుతున్న పథకాలపై అటు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తూ ఎంత గగ్గోలు పెట్టినప్పటికీ.. జగన్ ప్రభుత్వం మాత్రం తాము అనుకున్నది చేసి తీరుతామని అంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో  ఆరు నెలల్లోనే చాలా హామీలను నెరవేర్చారూ . పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మరోసారి రాజన్న పాలన వస్తుంది అని నమ్మకం తో ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ రాజన్న పాలన  అందిస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. 

 

 ఇప్పటికే ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ మంజూరు విషయంలో వయసును తగ్గిస్తూ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 30 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు నిర్ణయించింది జగన్ సర్కారు. పెళ్లై భర్త చనిపోయిన మహిళలు..35 సంవత్సరాల దాటి  భర్త నుంచి వేరుపడిన మహిళలు, గ్రామాల్లో పెళ్లి 30 ఏళ్ళు  పైబడిన మహిళలకు పెన్షన్ అందించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. అంతేకాకుండా పట్టణాల్లో 35 ఏళ్ల మహిళలకు పెన్షన్ అందించ  నుండగా.. ఎస్టీలకు 50 ఏళ్లకే ఫెన్షన్ ఇవ్వనున్నారు. తలసేమియా, పక్షపాత వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ అవసరం లేని కిడ్నీ పేషెంట్లకు వయోపరిమితి తో సంబంధం లేకుండా పెన్షన్ మంజూరు చేసేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: