ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్‌ఆర్టీసీ లీజు  కోసం ఎలక్ట్రిక్ బస్సులకు మళ్లీ టెండర్లు వేయబోతున్నారు. ఇందుకు  సంబంధించి జ్యుడీషియల్ కమిషన్‌ పలు అభ్యంతరాలను చెప్పడంతో మళ్లీ టెండర్ల నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. అధికారులు జ్యుడీషియల్ కమిషన్ తెలిపిన ఆధారంగా టెండర్ ప్రక్రియలో మార్పులను చేశారు. ఈ మార్పులు అన్ని పూర్తి అయినా తర్వాత వచ్చేవారం మళ్లీ టెండర్లు పిలవాలని  నిర్ణయం తీసుకున్నారు. ఇది అంత కూడా సీఎం జగన్ ఆదేశాలతో టెండరింగ్‌ను రద్దు చేసి జ్యుడీషియల్ కమిషన్‌ను పరిశీలన కోసం పంపడం జరిగింది. జ్యుడీషియల్ కమిషన్‌ టెండర్ డాక్యుమెంట్లను పరిశీలన చేసి.. వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనల పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. 

 


ఇక ఫేమ్‌-2 పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.55 లక్షల వరకు ఇస్తుండగా రాష్ట్రం మాత్రం  రూ.45 లక్షలు ఎందుకు ఇవ్వాలి అని న్యాయ కమిషన్‌ ప్రశించడం జరిగింది. ఈ విషయంపై  ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ.. దీని వల్ల బస్సు తయారీదారునికి ఆర్థికభారం తగ్గి, టెండర్లలో కిలోమీటర్‌కు కోట్‌ చేసే ధర తగ్గించేందుకు అవకాశాలు చాల ఉన్నాయి అని తెలియచేయడం జరిగింది. ఇదే కాకుండా  రూ.45 లక్షల సాయంపై ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకో లేదు అని  అధికారులు స్పష్టంగా తెలియచేయడం జరిగింది.

 

మరో వైపు అధికారులు మాత్రం వాయు కాలుష్యాన్ని అధిగమించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొని వస్తున్నాము అని తెలుపుతున్నారు.. కానీ, ప్రస్తుతం  ఆంధ్రాలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో లేదని కమిషన్‌ తెలిపింది. దీని వ్యతిరేకిస్తూ బీఎస్‌-6 బస్సుల ద్వారా కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంది అని తెలిపింది కమిషన్‌. కానీ  కేంద్రం మాత్రం  ఎలక్ట్రికల్ వాహనాల తయారీని ప్రోత్సహించడంలో భాగంగా జీసీసీ విధానంలో విద్యుత్‌ బస్సులను తీసుకోడానికి సాయం ఇస్తుంది అని అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: