సమాజంలో జరుగుతున్న దారుణ సంఘటనల విషయంలో చట్టం ఎన్ని సవరణలు చేసినా, నిందితులు మాత్రం భయపడటం లేదు.. చట్టాలు చేస్తున్న కొద్ది మృగాలు మరింతగా రెచ్చిపోతున్నారు. అందుకు ఉదాహరణగా దాదాపు 12 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలన సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసు కావచ్చూ. ఏడు సంవత్సరాల క్రితం జరిగిన నిర్భయ ఘటన కావచ్చూ. ఇదే కాకుండా నటి ప్రత్యష సంఘటన కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చూ.

 

 

వీరిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వారికి ఇప్పటికి శిక్షలు విధించలేదు. దీని బట్టి న్యాయం ఒక వైపే జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే డిసెంబర్ 27 వ తారీఖున 2007 లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నం లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా హత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం కాగా, పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకున్న నేపథ్యంలో సత్యం బాబును అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం దిగువ కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించగా, 2017లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

 

 

ఈ కేసులో సత్యంబాబు పాత్రలేదని, మాజీ మంత్రి కోనేరు రంగారావు కుమారుడు, హాస్టల్ వార్డెన్, మరికొందరిపై ఆయేషా తల్లిదండ్రులు మొదట్నుంచి ఆరోపణలు చేస్తున్నారు. కాగా ఏపీలో దిశ చట్టం తీసుకొచ్చిన సందర్భంగా ఆయేషా మీరా కు రీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఇప్పటికే పలువురికి సీబీఐ విచారించింది.

 

 

ఇకపోతే మొదట ఆయేషా డీఎన్‌ఏ టెస్ట్‌కు ముస్లిం మతపెద్దలు అంగీకరించలేదు. దీంతో సీబీఐ న్యాయస్థానం నుంచే అనుమతి తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆయేషాను ఖననం చేసిన తెనాలి సమీపంలో చెంచుపేటకు చేరుకున్న అధికారులు, వైద్యులు మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న సందర్భంగా, పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకున్నారు. రీ-పోస్ట్ మార్టం మొత్తం వీడియో చిత్రీకరిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: