ఈమధ్య సైబర్ నేరగాళ్ల బెడత జనాలకు చాలా ఎక్కువ అయిపోయింది ఎ.క్కడికి వెళ్ళినా ఏదో ఒకరకంగా సైబర్ నేరగాళ్లతో  ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ప్రజలు. అయితే ఇలాంటి నేరాలను తగ్గించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ప్రయోజనం  లేకుండానే పోతుంది. ఏదో ఒక విధంగా జనాలను మోసం చేసి వివరాలు సేకరించడం ఆ తర్వాత అకౌంట్ లో నుంచి డబ్బులు ఖాళీ చేయడం. లాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక అకౌంట్ లో నుంచి తమకు తెలియకుండా భారీగా డబ్బులు కాళీ అవడంతో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లి లబోదిబోమంటున్నారు. అయితే అటు బ్యాంకు అధికారులు కూడా ఖాతాదారులు అలర్ట్ గా ఉండాలని.. సైబర్ నేరగాళ్లకు తమ వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వకూడదని సూచిస్తున్నారు. 

 

 

 జనాలను మోసం చేయడానికి ఏమి చేయడానికైనా వెనుకాడటం లేదు సైబర్ నేరగాళ్లు. ఎక్కడికి వెళ్లిన జనాలకు మాత్రం  సైబర్ నేరగాళ్ల బెడద తప్పడంలేదు. దీంతో కనీసం ఏటీఎం కార్డు తో ఏం చేయాలన్నా.. ఫోన్లో ఏ లింకు ఓపెన్ చేయాలన్న వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏ  లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు ఎక్కడ మాయం అయిపోతాయో  ప్రజలు భయపడుతున్నారు. సైబర్ నేరగాళ్ల బెడద అంతలా పెరిగిపోయింది మరి. ఇక అటు బ్యాంకులు కూడా ఎప్పటికప్పుడు తమ ఖాతాదారులకు అలర్టు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎక్కువ ఖాతాదారులను కలిగిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బిఐ  ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. 

 

 

 మీ మొబైల్ ఫోన్ లకు  ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్ పెట్టకూడదని ఎస్బిఐ ఖాతాదారులకు సూచించింది. మామూలుగా అయితే మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పాయింట్ దగ్గర మొబైల్ కి చార్జింగ్ పెడుతూ ఉంటారు చాలామంది. ఈ విషయంలో ఎస్బిఐ మాత్రం తన ఖాతాదారుల్ని హెచ్చరించింది. చార్జింగ్ పాయింట్ల వద్ద హాకర్లు ఆటో డేటా ట్రాన్స్ఫర్ డివైజ్లను అమస్తూ ఉంటారు అని... దీంతో ఛార్జింగ్ పెట్టడం ద్వారా ఫోన్ లోని డాటా మొత్తం దొంగలించి అవకాశం ఉందని తన ఖాతాదారులకు సూచించింది. వివరాలు దొంగలించి బ్యాంకు ఖాతాలను యాక్సిస్ చేసి ఖాతాలోని డబ్బులు అన్నీ ఖాళీ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. కాబట్టి మొబైల్ ఫోన్లకు సొంత ఛార్జెర్ లతోనే ఛార్జింగ్ పెట్టడం ఉత్తమం అంటూ ఖాతాదారులను అలర్ట్ చేసింది ఎస్బిఐ.

మరింత సమాచారం తెలుసుకోండి: