పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం  పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది .ప్రభుత్వం ఈ బిల్లు ను ప్రవేశపెట్టినప్పటి నుండి కొందరు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఈ బిల్లు ఫై యూ ఎస్ ఏ   కూడా ఘాటు విమర్శలు చేసింది. బిల్లును వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు పెద్ద ఎత్తున్న జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేఘాలయా గవర్నర్ తథగత రాయ్ వివాదాస్పద ట్వీట్ చేస్తూ కొత్తగా వచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు తెలిపారు.

 

విభజన ప్రజాస్వామ్యం వద్దనుకునేవారు ఉత్తరకొరియాకు వెళ్లండి.  గవర్నర్ తథగత రాయ్.ట్వీట్ చేసాడు .ప్రజాస్వామ్యంలో కచ్చితంగా విభజన ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసారు .  ఉత్తరకొరియాకు వెళ్లొచ్చు అంటూ ఆయను  ట్వీట్ చేయడం వివాదాన్ని రేకిత్తిస్తోంది దేశంలో వివాదాస్పదమైన వాతావరణం నెలకొన్నసందర్బంగా  రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి .

 

గవర్నర్ తథగత రాయ్  మాట్లాడారు  . మతప్రాతిపదికన ఒకప్పుడు దేశం విభజించబడిందనేది ఒకటి .ప్రజాస్వామ్యంలో విభజన అనేది అవసరంగా చూడాలని రెండో విషయంగా చెప్పారు. రాజ్‌భవన్‌ను ఆందోళనకారులు చుట్టూ ముట్టడానికి కొన్ని గంటల ముందు ఈ గవర్నర్ ఈ ట్వీట్ చేశారు. రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అంతేకాదు భాష్పవాయువును కూడా  ఆందోళనకారులపై ప్రయోగించడంతో చాలామంది గాయాలపాలయ్యారు.

 

ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు గాయపడ్డారు.బయట వ్యక్తులు తమ ప్రాంతంలోకి ప్రవేశించరాదని చెబుతూ ఉన్న ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపాలంటూ నిరసనకారులు పట్టుబడుతున్నారు  అంతేకాదు ఒకవేళ ప్రవేశించాలంటే రిజిస్టర్ అయి ఉండాలని ఆందోళనకారులు అంటూ మాట్లాడారు . అదే సమయంలో కేంద్రం ఇన్నర్ లైన్ పర్మిట్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుతో మరో ఈశాన్య రాష్ట్రం అస్సాం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ఇప్పటికే అస్సాం రాష్ట్రం  పూర్తిగా కేంద్రబలగాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఈ ఆందోళనవలన విదేశీ మంత్రుల పర్యటనలు నిలిపి వేయ వలసి వచ్చింది ..

 

మరింత సమాచారం తెలుసుకోండి: