టీడీపీ తరుఫున కరుణం బలరాం.. వైసీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ 2014 ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి  ఇద్దరు భరి లోకి దిగారు . వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు ఉన్నాయ్ . అప్పుడు ఈ పోరులో గొట్టిపాటి గెలిచారు. కరుణం ఓటమిపాలు కావాల్సి వచ్చింది . అయితే ఎన్నికల్లో గెలిచినా తర్వాత గొట్టిపాటి  వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీకి మారారు.చంద్రబాబు కరుణంకు సర్ది చెప్పారు అప్పుడు కానీ తర్వాత  2019 ఎన్నికల్లో అద్దంకి సీటు వివాదం  నడిచింది. తమకంటే తమకు కావాలని  కరుణం గొట్టిపాటి రెండు వర్గాలు  కత్తులు నూరుకున్నారు.

 

చివరకు చంద్రబాబు అద్దంకిని సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటికి ఇచ్చి చీరాలను కరుణంకు ఇచ్చి ఇద్దరినీ  శాంతపరిచారు చేశారు.విభేదాలు పక్కనపెట్టి  ఇద్దరు ఒకరి గెలుపునకు ఒకరుసహాయ పడ్డారు అయితే తాజాగా గొట్టిపాటి మైనింగ్ క్వారీలపై వైసీపీ సర్కారు దాడులు చేస్తుందని ప్రచారం సాగింది.. ఆయన్ను పార్టీలోకి చేర్చుకునేందుకు సంప్రదింపులుచేస్తుందని మాట్లాడారు .

 

ఈ నేపథ్యంలోనే పార్టీ మారబోతున్న గొట్టిపాటికి సెటైర్ గా కరుణం పేరుతో సోషల్ మీడియాలో ఒక హాట్ కామెంట్ పోస్ట్ చేసారు . ‘బెదిరిస్తే బెదిరిపోయి  పార్టీ మారడానికి మాకు వ్యాపారాలు లేవు.. పార్టీ మారాల్సిన కర్మ మాకు పట్టలేదని’ గొట్టిపాటిని ఎత్తిపొడుస్తూ  పోస్టు పెట్టారు.దీంతో వీరిద్దరి మధ్య గొడవ   మళ్లీ మొదటకు వచ్చింది . వెంటనే దీనికి కౌంటర్ గా గొట్టిపాటి కూడా సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాడు. ‘20 ఏళ్లుగా చేస్తున్న క్వారీ వ్యాపారం అది.. అక్రమ కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటాను కానీ .. టీడీపీని వీడను.. జై తెలుగుదేశం  అంటూ ’ రివెర్స్ కౌంటర్ ఇచ్చాడు.

 

అయితే ఈ రెండు పోస్టులు కరుణం గొట్టిపాటి చేయలేదని వారి ఫ్యాన్స్ చేశారని అంటున్నారు. కానీ ఒకేపార్టీలోని నేతలు ఇలా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా కొట్టుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ గొడవ పెద్దది కాకా ముందే అధిష్టానం కల్పించుకొని వీరికి సర్దిచెప్పాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: