రామోజీరావు గారంటే తెలియని వారుండరు. ఎందుకంటే తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడిగానే కాకుండా, భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, ప్రధాన సంపాదకుడు మరియు ప్రచురణ కర్త. సినీ నిర్మాత, మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేతగా అందరికి సుపరిచితమే.. రామోజీరావు స్థాపించిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియోగా పేరుగాంచింది కూడా..

 

 

ఇకపోతే ఒక రైతు కుటుంబములో 16 నవంబర్ , 1936 తారీఖున జన్మించిన రామోజీరావు తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. ఇక రామోజీరావు గారు ఆగష్టు 10న 1974 లో విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడు సంస్దను ప్రారంభించాడు. అదే సంవత్సరం ఆగష్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడింది. మొదటిసారిగా ఏ ఆర్భాటాలు లేకుండా, ఈనాడు ప్రస్థానం  5000 ప్రతులతో  మొదలైన ఈ పత్రిక అనతి కాలంలోనే తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఎబిసి 2018 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 18,07,998 పత్రిక అమ్మకాలతో దేశంలో ఏడవ స్థానంలో నిలిచి, తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రికగా పేరుగాంచింది..

 

 

ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి. అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది. ఇకపోతే విశాఖపట్నం లో ప్రముఖ దినపత్రికలేవీ అచ్చవని ఆ రోజుల్లో ఈనాడు స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ రావడంతో ప్రజలకు మరింత చేరువయింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలను అందిస్తూ రావడమే ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చూ.. ఇకపోతే ఇప్పుడు రామోజీరావు గారు ఈనాడు నుంచి తప్పుకున్నాడు అనే వార్త పలువురిని ఆలోచనలో పడేసింది. అసలేం జరిగిందంటే ఇన్నాళ్లుగా ఎడిటర్ గా ఉన్న స్దానం నుండి ఆయన ఫౌండర్ గా మారగా ఆ స్దానంలో ఎడిటర్‌గా మరొకరు వచ్చారు...

మరింత సమాచారం తెలుసుకోండి: