ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మరోసారి తెరమీదకు వచ్చారు. 50 రోజుల పాటు సమ్మె కొనసాగించ అనంతరం ఒక డిమాండ్ కూడా పరిష్కారం కాకుండానే అశ్వత్థామరెడ్డి సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది అటు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోక ఇటు ఆర్టిసి డిమాండ్ల పరిష్కారం కాక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఆర్టీసీ కార్మికులు. అయితే ఆర్టీసీ కార్మికులను ఎట్టకేలకు ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది.అంతే కాకుండా ఆర్టీసీ కార్మికులు అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ కార్మికులు అందరికి సమ్మె  సమయంలో జీతాలు చెల్లించడంతో పాటు మహిళ ఆర్టీసీ కార్మికులకు రద్దు చేస్తామని తెలిపారు. 

 

 

 అయితే సమ్మె విరమించిన అప్పటినుంచి మీడియా ముందు ఎక్కడా కనిపించని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మరోసారి మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ డిపోలో రెండేళ్ల వరకు ఎన్నికలు నిర్వహించవద్దని వీధుల్లోకి చేరిన ఆర్టీసీ కార్మికులతో సంతకాలు చేయించుకోవడం దారుణమని అశ్వద్ధామ రెడ్డి ఆరోపించారు. విధుల్లో  చేరినప్పటికీ కార్మికులు ఎవరు సంతోషంగా లేరని అశ్వద్ధామ రెడ్డి వ్యాఖ్యానించారు. యూనియన్లు లేకుండా చేసేందుకు ఎన్నికలను వద్దంటూ ఆర్టీసీ కార్మికులతో సంతకాలు చేయించుకున్నారని కెసిఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అశ్వద్ధామ రెడ్డి. 

 

 

 అంతేకాకుండా మహిళా ఆర్టీసీ కార్మికుల డ్యూటీల  విషయంలో సీఎం కేసీఆర్ ఆదేశాలను ఆర్టీసీ సంస్థ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అశ్వద్ధామ రెడ్డి. మహిళల డ్యూటీ విషయంలో కేసీఆర్ ఆదేశాలను జారీ చేసినప్పటికీ ఆర్టీసీ అధికారులు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కెసిఆర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారని దీంతో విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతేకాకుండా బలవంతంగా ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల వద్దు అని సంతకాలు చేయించుకున్నారని సంతకం చేయని వారిని విధుల్లోకి తీసుకోము అని  చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు సంతకాలు చేశారు అంటూ అశ్వద్ధామ రెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: