సామాన్యుని స్థాయి నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని రెండుసార్లు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుని దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. మరి కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉద్దేశంతో కేజ్రీవాల్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి చెందిన రాజకీయ కన్సల్టెన్సీ ఇండియన్ ఫ్యాక్టో కేజీ చేతులు కలిపారు.

 

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారుకేజ్రీవాల్ తన ట్వీట్లో ఇండియన్ ప్యాక్ మాతో కలిసి పని చేసేందుకు రావడం మాకు ఆనందంగా ఉంది.అని వారికి స్వాగతం పలుకుతున్నాం అంటూ మాట్లాడారు. ఈ విషయంపై ఆ సంస్థ కూడా ధృవీకరించింది. అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్కు రీ ట్వీట్ చేస్తూ మేం ఎదుర్కొన్న ప్రత్యర్థులు అత్యంత కఠినమైన ప్రత్యర్థి మీరు ఈ విషయం పంజాబ్ ఎన్నికల  ఫలితాల తర్వాత  అర్థమైంది.అంటూ  మాకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో చేతులు కలపడం ఆనందంగా ఉంది అని ట్విట్టర్లో పేర్కొన్నారు .

 

అయితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తో కలిసి పని చేస్తోంది 2021 లో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని తిరిగి గెలిపించేందుకు ఇప్పటినుండి చేస్తోంది .ఈ సంస్థకు నేతృత్వం వహిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఈ సంస్థకు నేతృత్వం వహిస్తున్న ప్రశాంత్ కిషోర్ జనతాదళ్ యునెటైడ్ లో చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం  జేడీయూ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సొంత పార్టీ నేతల పైన విమర్శల వర్షం గుప్పించారు.

 

దీంతో ఆయనను పార్టీ నుంచి తొలగించినట్లు వార్తలు కూడా ప్రచారం అయ్యాయిఈ నేపథ్యంలో జేడీయూ అధినేత నితీష్ కుమార్ తో ప్రశాంత్ కిషోర్ నేడు భేటీ కానున్న డం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. 2014 ఎన్నికల్లో తన వ్యూహాలతో మోదీని గెలిపించడం లో ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగింది. ఆ తర్వాత ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్తో కలిసి పనిచేశారు 2017 లో కాంగ్రెస్ పక్కన చేరి ఆ పార్టీని పంజాబ్ ఎన్నికల్లో గెలిపించారు.తర్వాత జేడీయూ లో చేరారు 

మరింత సమాచారం తెలుసుకోండి: