వెటర్నరీ వైద్యురాలైన దిశను అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమెను సజీవదహనం చేశారు నలుగురు నీచులు. కనీసం ఆమె శరీరాన్ని ముట్టుకోనీకి కూడా లేకుండా పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు ఆ నీచులు. దీంతో యావత్ దేశం ఒక్కసారిగా కోపాన్ని పీకల మీదకు తెచ్చుకుంది. ఆ నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చెయ్యగానే.. ప్రజలంతా ఒక్కసారిగా వచ్చి ఆ నీచులను మాకు అప్పగించండి మేము చంపేస్తాం అంటూ కామెంట్లు చేశారు. 

 

అయితే పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఆ నీచులను కేసు రేకంస్ట్రక్షన్ అంటూ ఘటన స్థలానికి తీసుకురాగా.. అక్కడ ఆ నీచులు పారిపోవడానికి ప్రయత్నించి పోలీసులపైనే దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నీచులపై ఎన్కౌంటర్ జరిపి చంపేశారు. ఎన్కౌంటర్ కు గురైన ఆ నీచులు అక్కడే చచ్చారు.. అయితే వాళ్ళు చచ్చిన ఇంకా వాళ్ళ దరిద్రం పోలేదు.. 

 

ఎందుకంటే ఆ నీచులను ఆలా ఎన్కౌంటర్ చెయ్యకూడదు అంట.. కోర్టు ఏ శిక్షిస్తుంది అంట. చట్టానికి విరుద్ధంగా పోకూడదు.. అసలు నిందితులు వారో కారో అని ఈ ఎన్కౌంటర్ పై కోర్టులో పిటిషన్ వేశారు మహిళా సంఘాలు, మానవహక్కుల సంఘాలు. అయితే ఈ నేపథ్యంలోనే దిశ కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. దిశ లివర్‌లో లిక్కర్‌ ఉందని ఫోరెన్సిక్‌ నిపుణులు చెప్పారు. 

 

దిశ కేసులో పోలీసులకు మరో ఆధారం బలంగా మారింది. అత్యాచారం సమయంలో దిశ నోట్లో నిందితులు బలవంతంగా మద్యం పోశారని ఆ మద్యాన్ని రన్‌వే 44 వైన్స్‌లో నిందితులు మద్యం కొనుగోలు చేసినట్టు పోలీసులు సీసీఫుటేజ్‌ లో సేకరించారు. దీంతో దిశ ఎన్‌కౌంటర్‌ నిందితుల మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పుడు చెప్పండి దిశ నిందితులను ఎన్కౌంటర్ చెయ్యడం తప్ప ?

మరింత సమాచారం తెలుసుకోండి: