టీడీపీ ఎంపీ కనకమేడల   వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు .ప్రత్యేక హోదా  సంగతి ని వైసీపీ  పక్కన పెట్టింది  అంటూ మాట్లాడారు పార్లమెంటు ఉభయ సభల్లో రెండిట్లోనూ ఎక్కడ కూడా  వైకాపా ఎంపీలు రాష్ట్ర సమస్యల గురించే మాట్లాడలేదని ఆయన ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైకాపా ఎంపీల తీరును చూస్తుంటే వారి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు .

 

ముఖ్యమంత్రి జగన్ ,విజయసాయిరెడ్డి ఇతర అధికారులు ఆర్థిక నేరస్థులు గా ఉన్న కేసుల్లో ఎటువంటి పురోగతి లేదు .ముఖ్యమంత్రి పార్లమెంటరీ పక్ష నేతలు తమపై ఉన్న కేసులను తొలగించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి పెట్టారు అంటూ కనకమేడల ఆరోపించారు ..ముందుగా తాము అవినీతిరహిత వ్యక్తులను అని జగన్ విజయసాయిరెడ్డి నిరూపించుకోవాలని మాట్లాడారు .దిశ చట్టం లాగానే ప్రత్యేక చట్టం తీసుకొనివచ్చి వారి నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు .

 

వైకాపా ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ముందుకు పోతోందని ఎద్దేవా చేశారు తాము కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యల పైన చర్చించామని చెప్పారు. ఈ ఆరు నెలల్లో జగన్ పాలనలో రాష్ట్రానికి ఎనలేని నష్టం జరిగింది అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సంస్థలు అన్నీ తిరిగి వెనక్కి పోతున్నాయి అంటూ మాట్లాడారు .అటు పార్లమెంట్ లోనూ ఇటు అసెంబ్లీలోనూ ఆర్థిక నేరాల ప్రస్తావన లేదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు .

 

ప్రతిపక్షంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని పార్లమెంటులో మేము కేంద్రాన్ని కోరాము అంటూ మాట్లాడారు వైకాపా అధికారంలో ఉన్న కూడా వైకాపా మంత్రులు పార్లమెంటులో రాష్ట్ర అంశాలను లేవనెత్తే లేదు రాష్ట్ర రాజధానిగా అమరావతి అభివృద్ధి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. జగన్ తమ ఎంపీలను ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు పంపి ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించే దిశగా అడుగులు వేయాలని కనకమేడల వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: