ఏడేళ్ల క్రితం  దేశ  రాజధాని ఢిల్లీ లో  అతి కిరాతకంగా  హత్యాచారానికి గురైన  పారా మెడికల్ విద్యార్థిని నిర్భయ కేసులో  ఇటీవల సుప్రీం కోర్టు  తుది తీర్పు  వెలువరించిన  సంగతి తెలిసిందే. ఆరుగురు మృగాళ్లు ఈ దారుణానికి  ఒడిగట్టగా ఇందులో ఓ  నిందితుడు జైలు లోనే  ఊరి వేసుకొని  మరణించాడు, మరొకడు   బాల నేరస్థుడు. ఇక మిగిలిన  నలుగురు దోషులు ..వినయ్ శర్మ ,అక్షయ్ ఠాకూర్ ,ముఖేష్  సింగ్ ,పవన్ గుప్తాలను  త్వరలోనే  ఉరి తీయనున్నారు. ప్రస్తుతం ఈనలుగురు తీహార్ జైల్లో  శిక్ష అనుభవిస్తున్నారు.  
 
ఇక  వీరిని  ఉరి తీయడానికి  తలారి కావాలని   తీహార్ జైలు  అధికారులు ఉత్తరప్రదేశ్  జైళ్ల శాఖ కు లేఖ రాశారు.  దాంతో  యూపీ జైలు శాఖ అధికారులు  మీరుట్ జైలు తలారి  జలాద్ కు సమాచారం ఇచ్చారు.  ప్రస్తుతం ఆనలుగురు దోషుల కోసం  బక్సర్ జైల్లో  ఉరి తాళ్లను సిద్ధం చేస్తున్నారు.  తీహార్ జైలులో  ఉరి తీసే  తలారి  లేకపోవడంతో మీరుట్ జైలు తలారి జలాద్, తీహార్ జైలుకు వెళ్లనున్నాడు. ఈసందర్భంగా  మీడియా తో మాట్లాడాడు  జలాద్..  ఉరి తీయడానికి  అధికారులు నన్ను ఎప్పుడు పిలిచినా తీహార్  కు వెళ్లేందుకు  సిద్ధంగా వున్నానని  జలాద్ తెలిపాడు. అయితే ఉరి తీయించుకునే  నిందితులు ఎవరో తనకు తెలియదని  ప్రస్తుతం  నిర్భయ  దోషులకు  ఉరి విధించారు కాబట్టి  ఉరి తీయాల్సింది వారినేమోనని జలాద్ పేర్కొన్నాడు.
 
ఇదిలావుంటే తన కూతురు నిర్భయ మరణించిన రోజే  ఆనలుగురు నిందితులను ఉరి తీయాలని  నిర్భయ తల్లి కోరారు. మరోవైపు దోషులు తమను క్షమించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పెట్టుకున్న క్షమాబిక్ష  పిటిషన్‌ను తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: