గుంటూరు పట్టణ పరిధిలోని రాంరెడ్డి నగర్ లో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ లక్షణ్ రెడ్డి అనే యువకుడి పై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది . గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలికను పరామర్శించిన అనంతరం మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు . చిన్నారి కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు .  నిందితునిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి , మరెవరైనా నేరాలకు పాల్పడాలంటే వణుకు పుట్టేలా దిశ చట్టం  అమలు చేయనున్నట్లు వెల్లడించారు .

 

 గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించేందుకు వెళ్లిన వాసినారెడ్డి పద్మను వామపక్ష , జనసేన కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆసుపత్రి ఆవరణలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది . బాలికకు సత్వర న్యాయం చేయాలని, నిందితునిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధిత బాలిక కుటుంబ సభ్యులు , రాజకీయ , ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు .  బాలికను పరామర్శించేందుకు హోంమంత్రి , గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని జనసేన , వామపక్ష , టీడీపీ కార్యకర్తలు ధర్నా కు దిగారు .

 

 అత్యాచార ఘటన నిందితుల్ని  దిశ చట్టం ద్వారా  కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . దిశ చట్టం ఆమోదం పొందిన రోజే గుంటూరు పట్టణం లో ఐదేళ్ల బాలికపై ఇంటర్ యువకుడు అత్యాచారం చేసిన ఘటన సంచలనం సృష్టించింది . ఈ తరహా ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు నిందితున్ని దిశ చట్టం కింద కఠినంగా శిక్షించాలని రాజకీయ , ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: