రాష్ట్రంలో క్రమక్రమంగా భయానక వాతావరణం ఆలుము కుంటుంది. ఎందుకంటే ఆడపిల్లల స్వేచ్చను గద్దలు, ఎత్తుకెళ్లి పోతున్నాయి. ఈ గద్దలు ఆకాశంలో విహరించేవి కాదు. భూమి మీదే సంచరిస్తూ, రెండు కాళ్లూ, రెండు చేతులతో సహా అన్ని అవయవాలు సక్రమంగా ఉండి "మాను"షులు అని చెప్పుకు తిరిగే మానవత్వం మరచిన గద్దలు.

 

 

ఇప్పుడు ఈ గద్దల్లో ఒక గద్ద అభంశుభం తెలియని ఐదేళ్ల వయసున్న పాపపై కన్నేసి కాలరాసింది.. వివరాలు తెలుసు కుంటే దిశ బిల్లును అసెంబ్లీ ముక్త కంఠంతో ఆమోదించిన రోజే గుంటూరు సిటీలో దారుణ ఘటన వెలుగు చూసింది. తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు చిన్న పిల్ల అని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ నీచున్ని పోలీసులు అరెస్ట్ చేసి అత్తగారింటికి తరలించారు. ఇకపోతే బాధిత పాప ప్రస్తుతం జీజీహెచ్‌ ఆస్పత్రి లో చికిత్స పొందుతుంది. ఇక  ఈ ఉదంతం పై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి.

 

 

బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని నిరసనలు తెలుపుతున్నారు. సమాజంలో మనిషి అని చెప్పుకుని తిరుగుతున్న ఇటువంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించేందుకు తెచ్చిన దిశ చట్టం ఇప్పుడు వీని విషయంలో ఎలా ప్రవర్తిస్తుందనే ఆసక్తి ప్రతివారిలో రేకెత్తు తుంది. ఈ సందర్భంగా నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తారా.. లేక రెడ్డి సామాజిక వర్గంవాడని చెప్పి వదిలిపెడతారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు..

 

 

దీంతో జీజీహెచ్‌ ఆస్పత్రి ప్రాంతంలో కొద్దిగంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ సందర్భంగా జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భాధితురాలి కుటుంబానికి జనసేన అండగా ఉంటుందన్నారు. నిందితుడిపై దిశ 2019 చట్టాన్ని తక్షణమే ఆమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిందితుల కేసులను రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు వాదనలు వినిపించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: