ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయలాంటి అత్యాచార ఉదంతం.. వేరే దేశంలో జరిగిఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేదేమో. దోషులకు ఈ పాటికి కఠినమైన శిక్ష పడిపోయేదే. కానీ మన రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పుణ్యమా అని.. నిర్భయ దోషులు జైల్లో ముప్పొద్దులా తింటూ మరింత బలిష్టంగా తయారయ్యారు. 

 

యావత్‌ దేశాన్ని నిర్ఘాంతపోయేలా చేసిన నిర్భయ అత్యాచార ఉదంతం జరిగి ఏడేళ్లయిపోయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తాయి. నిందితుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేయాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. మరోవైపు దోషులు మన న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను పట్టేసుకుని.. తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని స్పష్టమవుతోంది.  నిందితుల్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోగా...  జైలు జీవితాన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది. 

 

ఉరిశిక్షపై  వింతయిన కారణాలు చూపుతూ.. వేదాలు, ఉపనిషత్తులు వల్లెవేస్తూ.. దోషుల్లో ఒకడైన అక్షయ్‌ సింగ్‌ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసి.. వార్తల్లో నిలిచాడు. తాజాగా మరో దోషి వినయ్‌ శర్మ కూడా వార్తల్లోకెక్కాడు. తాజాగా బయటకు వచ్చిన అతని వీడియోలు చూస్తే.. ఔరా! జైలు జీవితం ఇంత బాగుంటుందా అనిపించకమానదు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో అలాంటి అభిప్రాయమే వ్యక్తమమవుతోంది.

 

పోలీసు బందోబస్తు మధ్య కనించిన వినయ్‌ శర్మను చూసి అంతా షాకవుతున్నారు. దిట్టంగా బలంగా సిక్స్‌ ప్యాక్‌ తో.. హీరోలా దర్శనమిచ్చిన అతణ్ని చూస్తే.  మన వ్యవస్థ క్రూరమైన నేరానికి పాల్పడినవాళ్లను ఎలా మేపుతుందో, వారికోసం ఎంత డబ్బును, సమయాన్ని వృథా చేస్తోందో అర్థమవుతుంది. సోషల్‌ మీడియాలో ఇప్పుడు వినయ్‌ శర్మ ఫొటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. నిర్భయ కేసులో అరెస్టయినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు జైలు కూడు ఒంట బట్టించుకుని ఎలా బలిష్టంగా బలిసిపోయాడో? అని పోలుస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నాడు. 

 

జైల్లోకి వచ్చిన కొత్తలో సాధారణంగా ఉన్న వినయ్‌.. మనిషిగా మారాడో లేదో తెలియదుగాని శిక్ష అనుభవిస్తూ ఫిజిక్‌ను మాత్రం బాగానే డెవలప్‌ చేసుకున్నాడు. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ... ఇలాంటి వారిని ఎలా మేపుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నలుగురు దోషులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. వీరిని త్వరలోనే ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: